Tollywood: ఈ గుండు పాపను గుర్తు పట్టారా? స్టార్ డైరెక్టర్ కూతురు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా..
పై ఫొటోలో ఉన్న గుండు పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి స్టార్ డైరెక్టర్, ప్రముఖ నటిల గారాల పట్టి. తల్లిదండ్రుల జాడల్లోనే నడుస్తూ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది.

స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులోనే షేర్ చేసుకుంటారు. తమ రెగ్యులర్ అప్డేట్స్, ఫొటోస్, వీడియోలను సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. ఇక పుట్టిన రోజులు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే సోషల్ మీడియా ద్వారానే అందరికీ విషెస్ చెబుతుంటారు. అలా ఇప్పుడు కూడా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ద్వారానే తన బాయ్ ఫ్రెండ్ అయిన యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. పైన ఉన్న ఫొటో అదే. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది. బర్త్ డే విషెస్ కంటే గుండుతో కనిపించిన కనిపించిన పాప ఇందులో హైలెట్ గా నిలిచింది. చాలా క్యూట్ గా కనిపించి నెటిజన్ల మదిని దోచుకుంది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? పేరుకు మలయాళ హీరోయినే అయినప్పటికీ తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. అక్కినేని అఖిల్, సాయి ధరమ్ తేజ్ వంటి క్రేజీ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, ఛార్మింగ్ లుక్స్ తో తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది. ఇంతకీ ఆ క్యూటీ ఎవరనుకున్నారు? హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్.
తెలుగులో అక్కినేని అఖిల్ తో కలిసి ‘హలో’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రియదర్శిని. అలాగే సాయి ధరమ్ తేజ్ సూపర్ హిట్ సినిమా చిత్రలహరి లోనూ కథానాయికగా నటించింది. ప్రస్తుతం తన మాతృభాష మలయాళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజి బిజీగా ఉంటోంది.
కల్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియదర్శిని తన బాయ్ ఫ్రెండ్, మోహన్ లాల్ కొడుకు, హీరో ప్రణవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అందులో కల్యాణి గుండుతో చాలా క్యూట్ గా కనిపించింది. కాగా ప్రణవ్- ప్రియదర్శిని ప్రేమలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే ప్రణవ్-కల్యాణి మంచి స్నేహితులు మాత్రమేనని ప్రణవ్ తల్లి ఇటీవల చెప్పుకొచ్చింది.
కీర్తి సురేష్ పెళ్లిలో కల్యాణి ప్రియదర్శన్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








