Tollywood: అబ్బాయి అనుకునేరు! టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరోనే.. గుర్తు పట్టారా?
ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. చిన్న వయసులోనే స్టార్ హీరోల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది

పై ఫొటోను చూసి ఠక్కున అబ్బాయి అనుకునేరు. ఇది ఒక క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫొటో. చాలామంది లాగే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో చిన్నతనంలోనే కెమెరాల ముందుకు వచ్చింది. కొన్ని టీవీ షోస్ తో పాటు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. చదువు కోసం మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్లీ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసింది. శింబు, విజయ్ సేతుపతి, నివీన్ పౌలి, విక్రమ్ ప్రభు తదితర స్టార్ హీరోలతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడంటే మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. అందులోనూ ఒక్క సినిమానే తనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను ప్రేమ వివాహం చేసుకుందీ అందాల తార. దీంతో క్రమంగా సినిమాలకు బ్రేక్ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో కనిపెట్టారా? ఆమె మరెవరో కాదు ‘వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన మంజిమా మోహన్. అదే నండి నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో లీల పాత్రలో మెరిసిన హీరోయిన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
సాహసం శ్వాసగా సాగిపో సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో నటించింది మంజిమా మోహన్. ఈ సినిమాల్లో ఆమె నారా భువనేశ్వరి రోల్ ను పోషించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అయితే తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉండిపోయింది. అయితే 2022లో ఈ ముద్దుగుమ్మ హీరో ప్రముఖ సీనియర్ నటుడు కార్తీక్ కొడుకు హీరో గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు.
భర్తతో మంజిమా మోహన్..
View this post on Instagram
మంజిమా చివరిగా 2023లో బూ అనే ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తోంది. భర్త కార్తీక్ మాత్రం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు కార్తీక్.
జిమ్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








