Tollywood: కలువ కన్నుల చిన్నది.. చిరంజీవికి జోడిగా ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్.. గుర్తుపట్టండి..

ఆ నయనాలను దక్షిణాది ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందం, అభినయం ఆమె సొంతం. చందమామ లాంటి రూపానికి.. ఆ కళ్లే మరింత అందం. ఒకప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై.. ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా ప్రత్యకంగా ఫ్యాన్ బేస్ ఉండేది. గుర్తుపట్టారా ?.

Tollywood: కలువ కన్నుల చిన్నది.. చిరంజీవికి జోడిగా ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2023 | 7:15 PM

ఆ కలువ కన్నులలో ఎన్నో భావోద్వేగాలు. ఆ నయనాలను దక్షిణాది ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందం, అభినయం ఆమె సొంతం. చందమామ లాంటి రూపానికి.. ఆ కళ్లే మరింత అందం. ఒకప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై.. ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా ప్రత్యకంగా ఫ్యాన్ బేస్ ఉండేది. గుర్తుపట్టారా ?.. తనే అలనాటి హీరోయిన్ మాధవి. చిరు సరసన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో నటించింది. తాజాగా మాధవి చిన్ననాటి ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. అట్రాక్టివ్ కళ్లు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మాధవి.. 1962 సెప్టెంబర్ 14న హైదరాబాద్ లో జన్మించారు. దర్శకుడు కె.బాలచందర్ 1979లో తెరకెక్కించిన మరో చరిత్ర సినిమాతో ఆమె చిత్రరంగానికి పరిచయం అయ్యారు. ఆమె అసలు పేరు కనక విజయలక్ష్మి. అయితే అప్పటికే సినీ పరిశ్రమలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండడంతో ఆమె పేరును మాధవి అని మార్చారు దాసరి నారాయణ రావు. మరో చరిత్ర సినిమా తర్వాత మంచి మనసు మూవీలో నటించింది మాధవి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జోడిగా.. ప్రాణం ఖరీదు మూవీలో నటించారు. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి అలరించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Maadhavi (@actress.maadhavi)

చిరు, మాధవి కాంబోలో ప్రాణం ఖరీదు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్లులేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బందిపోటు సింహం వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు మాధవి. 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురి అమ్మాయిలు.. ప్రస్తుతం మాధవి తన భర్తతో కలిసి నర్యూజెర్సీలో స్థిరపడిపోయారు. మాధవి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

View this post on Instagram

A post shared by Maadhavi (@actress.maadhavi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.