Tollywood : వర్కవుట్స్‌తో బిజీగా ఉన్న హీరోయిన్.. మళ్లీ ఫ్యాన్స్ ముందుకు రానున్న ముద్దుగుమ్మ.. ఎవరో తెలుసా ?.
చాలాకాలం పాటు విశ్రాంతి తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్స్, ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఈ హీరోయిన్..ఇప్పుడు వర్కవుట్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వర్కవుట్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?..

సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది. అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలోని స్టార్ హీరోస్ అందరి జోడిగా నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో దూసుకెళ్తున్న సమయంలోనే అనుకోని కారణాలతో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. చాలాకాలం పాటు విశ్రాంతి తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్స్, ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఈ హీరోయిన్..ఇప్పుడు వర్కవుట్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వర్కవుట్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?.. తనే హీరోయిన్ సమంత. మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న సామ్.. ఇన్నాళ్లు ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. కండరాల సమస్య వేధించడంతో ఎటు కదల్లేక.. కనీసం బరువులు ఎత్తలేకపోయింది. సినిమా షూటింగ్స్ కూడా చేయలేకపోయింది. కానీ ఇప్పుడు తన ఫిట్ నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
శాకుంతలం సినిమా చిత్రీకరణ సమయంలోనే మయోసైటిస్ సమస్య ఉందని తెలిపింది సామ్. అప్పటినుంచి అతి కష్టం మీద యశోద, ఖుషి, సిటాడెల్ కంప్లీట్ చేసింది. యశోధ సినిమా తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న సామ్.. ఆ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను పూర్తి చేసింది. విజయ్ దేవరకొండ నటించిన ఈమూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు బ్రేక్ తీసుకుంది. అమెరికా, భూటాన్ దేశాల్లో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే సామ్ తిరిగి కోలుకుంటుంది. కొన్నిరోజులుగా సిటాడెల్ ప్రమోషన్స్, మూవీ ఈవెంట్లలో పాల్గోంటుంది.
అలాగే ఫిట్ నెస్ పై మరింత దృష్టి పెట్టింది. కఠినమైన వర్కవుట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా సామ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. చాలా కాలం తర్వాత బీస్ట్ మోడ్ లోకి మారిపోయిన సమంతను చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంత తక్కువ సమయంలో సామ్ మళ్లీ మునపటిలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఆమె తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనుందని అంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




