Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. అందమైన ప్రేమకథతో అడియన్స్ హృదయాలను దొచేసిన..
అప్పట్లో ఆమెకు యూత్‌లో యమ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ మూవీతో వెండితెరపై మెరిసి అంతలోనే ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి, పిల్లలు అంటూ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ అలరించారు. గుర్తుపట్టారా ?.

పైన ఫోటోలో కనిపిస్తోన్న హీరోయిన్ గుర్తుపట్టారా ?.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చేసింది అతి తక్కువ సినిమా అయినప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. అప్పట్లో ఆమెకు యూత్‌లో యమ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ మూవీతో వెండితెరపై మెరిసి అంతలోనే ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి, పిల్లలు అంటూ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ అలరించారు. గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ రిచా పల్లాడ్. ఈపేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. నువ్వే కావాలి హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.. ఈరోజు (ఆగస్ట్ 30 )పుట్టిన రోజు.
డైరెక్టర్ విజయభాస్కర్ దర్శకత్వంలో లవర్ బాయ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నువ్వే కావాలి. ఇందులో తరుణ్ జోడిగా రిచా పల్లాడ్ కథానాయికగా నిటంచింది. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపు 22 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటికీ ఈసినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. నువ్వే కావాలి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రిచాకు ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఆడపాదడపా సినిమాలు చేసి తనను తాను నిరూపించుకుంది.




View this post on Instagram
అయితే ఆతర్వాత కూడా రిచాకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రిచా.. 2016లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు. సినిమాలకు దూరంగా ఉన్న రిచా.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
రిచా పల్లాడ్ 1980 ఆగస్ట్ 30న బెంగుళూరులో జన్మించారు. 1991లో విడుదలైన హిందీ సినిమా లమ్హేలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత 2000లో నువ్వే కావాలి సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి అలరించింది రిచా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




