Amala Paul: ‘నన్ను మోసం చేశారు.. ఎవరినీ నిందించను’.. అమలా పాల్ కామెంట్స్..
విజయ్, ధనుష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లి అమలా పాల్ వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం పై ఎక్కువగా ప్రభావం చూపించింది. దీంతో చాలా కాలంగా అమలా పాల్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక కొద్ది రోజుల క్రితం అమలా పాల్ నటించిన ఆమె సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. విజయ్, ధనుష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లి అమలా పాల్ వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం పై ఎక్కువగా ప్రభావం చూపించింది. దీంతో చాలా కాలంగా అమలా పాల్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక కొద్ది రోజుల క్రితం అమలా పాల్ నటించిన ఆమె సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు.
తమిళ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. డివోర్స్ అనంతరం అమలా పాల్ తన కెరీర్ పై దృష్టి పెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ మాట్లాడుతూ.. “మైనా సినిమా చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పులు వచ్చింది. మానసిక ఒత్తిడికి గురయ్యాను. అలాగే అనారోగ్య సమస్యలు ఎదుర్కోన్నాను. అదే సమయంలో నేను నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దీంతో నాపై మరింత ఒత్తిడి పెరిగింది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించారు అనే చెప్పడం కరెక్ట్. కరోనా తర్వాత జీవితంలో ఎక్కడికీ వెళ్లలేదు. షూటింగ్స్ లేవు. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయలేదు. రెండేళ్లు ఇంట్లోనే ఉండిపోయాను. నాకు చాలా సమయం దొరికింది. అందుకు నేను తిరిగి కోలుకోవాలని అనుకున్నాను. నాకు ఎదురైన పరిస్థితుల నుంచి పారిపోకూడదని అనుకున్నాను.




View this post on Instagram
13 ఏళ్ల వయసు నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను . కానీ ఏరోజు సంతోషంగా లేను. ఏదో వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఒకదాని తర్వాత ఒకటి నా విజయాన్ని కోరుకున్నాను. కానీ నాతో ఎవరూ లేరు. నన్నూ నేను కోల్పోయాను. బహుశా నాకు ఓ మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి ఉంటే నేను అందరిలాగా సంతోషంగా ఉండేదాన్ని కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితికి ఎవరినీ నిందించను. మనసు సరిగ్గా ఉంటేనే పరిసరాలు సరిగ్గా ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల అమలా పాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మట్టితో బొమ్మలు చేస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




