Tollywood: చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు టాలీవుడ్ అటామ్ బాంబ్.. సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్గా..
చూడచక్కని రూపం.. ఆకట్టుకునే కళ్లు.. హృదయాలను దొచేసే చిరునవ్వుతో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు టాలీవుడ్ సెన్సెషన్. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తుంది. ఒకప్పుడు ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ అటామ్ బాంబ్లా నెట్టింట అగ్గిరాజేస్తుంది. ఇంతకీ ఆ తార ఎవరో తెలుసా.. ?

సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను ఆకట్టుకునే త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలకు చెందిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఈ ఫోటోస్ పట్ల అటు నెటిజన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. రోజుకో సినీతార చిన్ననాటి ఫోటోస్ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ చిన్నారి నాట్యమయూరి అందమైన పిక్చర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..? చూడచక్కని రూపం.. ఆకట్టుకునే కళ్లు.. హృదయాలను దొచేసే చిరునవ్వుతో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు టాలీవుడ్ సెన్సెషన్. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తుంది. ఒకప్పుడు ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ అటామ్ బాంబ్లా నెట్టింట అగ్గిరాజేస్తుంది. ఇంతకీ ఆ తార ఎవరో తెలుసా.. ? తనే ఐశ్వర్య మీనన్. ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య మీనన్.. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఐశ్వర్య.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో అరంగేట్రం చేసిన ఐశ్వర్య.. మొదట్లి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో కథానాయికగా మారింది. దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న ఐశ్వర్య.. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
తమిళం, కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్య.. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక అటు ఐశ్వర్యకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. స్పై సినిమా తర్వాత చాలా కాలం సైలెంట్ అయిన ఐశ్వర్య.. భజే వాయువేగం సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది. యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాను భారతనాట్యం డ్యాన్సర్ అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




