AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కాఫీ షాప్‏లో పనిచేసిన అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ.. ఎవరంటే..

ఆరంభంలోనే నిరాశ మిగిల్చినా.. తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఆ అమ్మడు ఒకప్పుడు చదువుకుంటూనే కాఫీ షాప్‏లో వర్క్ చేసిందట. అటు చదువు.. ఇటు పనిని రెండింటిని హ్యాండిల్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood: కాఫీ షాప్‏లో పనిచేసిన అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ.. ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: May 29, 2024 | 8:53 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో ఆ అమ్మడు ఒకరు. అందం, అభినయంతో మెప్పిస్తోన్న ఆ బ్యూటీ.. 16 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. కెరీర్ తొలినాళ్లలోనే బీటౌన్ స్టార్ హీరో సల్మాన్ సరసన నటించేందుకు నిరాకరించింది. కానీ ఇప్పుడు దీపికా పదుకొణె, అలియా భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ వంటి స్టార్ నటీనటులకు పోటీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి తెలుగు, హిందీ భాషలలో అనేక మంది అభిమానులు ఉన్నారు. తొలి చిత్రంతోనే ప్లాప్ అందుకుంది. దీంతో ఆరంభంలోనే నిరాశ మిగిల్చినా.. తన ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఆ అమ్మడు ఒకప్పుడు చదువుకుంటూనే కాఫీ షాప్‏లో వర్క్ చేసిందట. అటు చదువు.. ఇటు పనిని రెండింటిని హ్యాండిల్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదండి … ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా కపూర్.

అవును.. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మాయి కాలేజీ రోజుల్లో ఓ కాఫీ షాపులో పనిచేసిందట. అందుకుగల కారణాలేంటో తెలుసుకుందామా. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ శ్రద్ద కపూర్. హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన శక్తి కపూర్, శివంగి కపూర్ దంపతుల కుమార్తె శ్రద్ధ. చిన్నప్పటి నుంచి నటిగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. ఆమెకు 16 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ నటించిన లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికీ నటిగా తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఏడాది తీన్ పట్టి సినిమాతో తెరంగేట్రం చేసింది.

సినిమాల్లోకి రాకముందు శ్రద్ధా కపూర్ సైకాలజిస్ట్ కావాలనుకుంది. విదేశాల్లో సైకాలజీ చదివేందుకు వెళ్లిన శ్రద్ధా.. అక్కడ ఒక కాఫీ షాపులో పనిచేసిందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. శ్రద్ధా కపూర్ నటించిన తొలి చిత్రం తీన్ పట్టి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా ప్లాప్ అయ్యాయి. చివరకు ఆదిత్య రాయ్ జోడిగా నటించిన ఆషికీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో శ్రద్ధాకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత తిరిగి చూడలేదు శ్రద్ధా. హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఒక్కొ సినిమాకు దాదాపు రూ.7 కోట్లు వసూలు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.