Tollywood: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్.. వెండితెరపై జూనియర్ సౌందర్య.. ఎవరో గుర్తుపట్టండి..
సోషల్ మీడియా పేజీల్లో సినీ తారలను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొందరు నటీమణులు తమ ప్రస్తుత ఫోటోలే కాకుండా తమ చిన్ననాటి, పాత ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ చిన్నారి పిక్ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ చిన్నారి తెలుగు అభిమానులకు ఇష్టమైన హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా సంప్రదాయ లుక్ లో కనిపిస్తూనే ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నారి.
ఇంటర్నెట్ పెరుగుతున్న నేటి కాలంలో చాలా మంది సినీ తారలు తమ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమా, స్మాల్ స్క్రీన్ కంటే ఎక్కువ మంది అభిమానులు నటీనటుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. దీంతో సోషల్ మీడియా పేజీల్లో సినీ తారలను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొందరు నటీమణులు తమ ప్రస్తుత ఫోటోలే కాకుండా తమ చిన్ననాటి, పాత ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ చిన్నారి పిక్ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ చిన్నారి తెలుగు అభిమానులకు ఇష్టమైన హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా సంప్రదాయ లుక్ లో కనిపిస్తూనే ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నారి. ఎవరో గుర్తుపట్టండి.
దక్షిణాది చిత్రసీమలో స్మైలింగ్ క్వీన్‌గా పేరుగాంచిన ఆమె ప్రముఖ నటీనటులతో పాటు పలు హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పెళ్లయినా అభిమానుల్లో ఆమె స్థానం అలాగే ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె ఎవరంటే హీరోయిన్ స్నేహ.
View this post on Instagram
తొలివలపు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన స్నేహ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. సంప్రదాయ లుక్ లో కనిపిస్తూ జూనియర్ సౌందర్యగా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఏమండోయ్ శ్రీవారు, రాధాగోపాళం, పాండురంగ, శ్రీరామదాసు చిత్రాలతో స్నేహకు మంచి గుర్తింపు వచ్చింది.
View this post on Instagram
తమిళ్ నటుడు ప్రసన్నతో అచ్చాముందు అచ్చాముందు చిత్రంలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2012 మే 11న వీరిద్దరి వివాహం జరిగింది. స్నేహకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో రానున్న తలపతి 68లో కనిపించనుంది స్నేహ.
View this post on Instagram