Tollywood: బాత్ టబ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ.. ఎవరో గుర్తుపట్టగలరా ?.
కొద్దిరోజులుగా వరుస ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుందీ హీరోయిన్. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా కాస్త బ్రేక్ తీసుకున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. గ్లామర్ రోల్స్.. లేడీ ఓరియెంటెడ్ డ్రామాలైనా సరే.. విలక్షణ పాత్రలలో కనిపించి అలరించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం భూటాన్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అలాగే అక్కడే

కొద్దిరోజులుగా వరుస ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుందీ హీరోయిన్. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా కాస్త బ్రేక్ తీసుకున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. గ్లామర్ రోల్స్.. లేడీ ఓరియెంటెడ్ డ్రామాలైనా సరే.. విలక్షణ పాత్రలలో కనిపించి అలరించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ సమంత. ప్రస్తుతం భూటాన్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అలాగే అక్కడే మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఏడాది కాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇటీవలే అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు భూటాన్ లో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ అందమైన ప్రదేశాలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ..ప్రపంచానికి దూరంగా తనకు నచ్చినట్లుగా సమాయాన్ని గడిపేస్తుంది.
ఖుషి తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పలేదు సమంత. అందుకు కారణం మయోసైటిస్ అని తెలుస్తోంది. ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సామ్ తన కెరీర్ పై దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే.. భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సామ్.. మానసిక ప్రశాంతత కోసం అక్కడి అందమైన ప్రదేశాల్లో స్నేహితులతో కలిసి వేకేషన్ కు వెళ్తుంది. భూటాన్ వీధుల్లో తన ఫ్రెండ్స్ తో సరదాగా దిగిన ఫోటోలను ఇప్పటికే ఇన్ స్టాలో పంచుకుంది. తాజాగా బాత్ టబ్బులో ఉన్న సమంత ఫోటోస్ నెట్టింట వైరలవుతుంది. ఇన్ స్టా వర్సెస్ రియాల్టీ అఏంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. వీటిపై సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
సామ్ చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సామ్ నటించిన సిటాడెల్ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.