Viral Video: ఓ మైగాడ్.. అన్నా నువ్వా ..! పాముకు ఎదురెళ్ళిన నెమళ్లు.. తర్వాత జరిగిన సీన్ చూస్తే..
రంగురంగుల పించం, సుందరమైన రూపంతో చూడ్డాన్ని అందంగా కనిపించే నెమళ్లు విషపూరితమైన పాములను సైతం భయపెట్టగలదని మీకు తెలుసా? అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఓ వీడియోనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అడవిలో వెళ్తున్న ఓ నెమలికి సడెన్‌గా ఓ నాగుపాము ఎదురైంది. అప్పుడు ఆ నెమలి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి.. మళ్లి తిరి వెనక్కి వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వైరల్ వీడియోలో రెండు నెమళ్లు, ఒక ఆడ నెమలి కలిసి నడుస్తుండగా వాటికి సడెన్‌గా ఓ నాగుపాము అడ్డొస్తుంది. దీంతో ఆ నెమళ్లు ఒక్కసారిగా ఆగిపోతాయి. అది చూసిన పాము పడగ విప్పి వాటి ముందు నిల్చున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే నెమళ్లు మాత్రం దానికి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లాయి. మళ్లీ ఆ పామును ఏమనకుండా వెనక్కి వచ్చాయి. ఇది గమనించిన కొందరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
పాము- నెమలి నిజంగానే శత్రువులా?
శాస్త్రీయంగా చూస్తే, పాము, నెమలికి మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. సాధారణంగా నెమలి ఒక సర్వభక్షకి. ఇది పురుగులు, కీటకాలతో పాటు చిన్న పాములను కూడా ఆహారంగా తీసుకుంటుంది. ఆ సమయంలో వాటికి పాములు ఎదరైనా అవి వాటిన తినేందుకు వెనకాడవు. పాము వాటి నుంచి తప్పించోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే నెమలికి ఉండే బలమైన కాళ్లు, గోళ్లు, ముక్కు పాములను ఎదుర్కోవడానికి వాటికి సహాయపడుతాయి. ఒక వేళ పాము దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, నెమలి తన భారీ పించాన్ని విప్పి పామును అయోమయానికి గురిచేస్తుంది.పాము నెమలి ఈకల మధ్య చిక్కుకున్నప్పుడు, నెమలి తన వాడియైన ముక్కుతో పాము తలపై బలంగా కొట్టి దానిని అంతం చేస్తుంది.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
