AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే.. నోటీసులు పంపిన నటి

బిగ్ బాస్ గేమ్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది బిగ్ బాస్ హోస్ లోకి వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది. బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా బిగ్ బాస్ లోకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే.. నోటీసులు పంపిన నటి
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2026 | 3:26 PM

Share

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్ గేమ్ షో.. హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ భాషలతో పాటు తెలుగులోనూ బిగ్ బాస్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ 10మొదలుకానుంది. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనాలని సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ గేమ్ షోకు ఎంత పాజిటివ్ వచ్చిందో అంతే నెగిటివ్ కూడా వచ్చింది. చాలా మంది బిగ్ బాస్ గేమ్ షో మీద విమర్శలు చేశారు.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

బిగ్ బాస్ లో పాల్గొన్న వారు కూడా బిగ్ బాస్ పై చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది బిగ్ బాస్ గేమ్ షో స్క్రిప్ట్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. కొంతమంది నెగిటివ్ మాత్రమే చూపించారని అసలైన ఆట మొత్తం ఎడిటింగ్ లో తీసేశారని కూడా ఆరోపణలు చేశారు. తాజాగా బిగ్ బాస్ గేమ్ షో మీద ఓ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్‌ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సీజన్ లో సినీ నటి తన్వీ కొల్టే నిలిచింది. అయితే ఇదే సీజన్ లో మోడల్‌, నటి సోనాలి రౌత్ కూడా పాల్గొంది.

ఇవి కూడా చదవండి

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

అయితే సోనాలి రౌత్ బిగ్ బాస్ కు నోటీసులు పంపించింది. రూ.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని నోటీసులు పంపించిందని తెలుస్తుంది. బిగ్ బాస్ గేమ్ షో వల్ల తాను మానసిక, శారీరక క్షోభకు గురయ్యానని ఆమె తెలిపింది. అంతే కాదు బిగ్ బాస్ లోని వాతావరణం కారణంగా తనకు చర్మ సంబంధిత వ్యాధి (తామర) వచ్చిందని ఆరోపించింది. అందుకే షో నుంచి రెండు వారాల్లోనే బయటకు వచ్చేశా అని.. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా ఆ వ్యాధి తగ్గలేదని ఆమె ఆరోపించింది. ఈమేరకు సోనాలి రౌత్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఈ అమ్మడి వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

View this post on Instagram

A post shared by Sonali Raut (@isonaliraut)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్
88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్