అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు తోపు ప్రొడ్యుసర్.. ఈ అమ్మడు ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
18 April 2026
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది ఆమె.
సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకునే నిహారిక, తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి.
లేటెస్ట్ ఫోటోషూట్‌లో నిహారిక బ్లాక్ కలర్ హాఫ్ శారీ (పరికిణీ వోణి) ధరించి ఒక దేవకన్యలా మెరిసిపోతున్నారు. సాధారణంగా వెస్ట్రన్ డ్రెస్సులలో ట్రెండీగా కనిపించే నిహారిక
ఈసారి పక్కా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్లాక్ కలర్ డ్రెస్సుకి మ్యాచింగ్ గా తలకు మల్లెపూలు పెట్టుకుని, చిరునవ్వుతో అందంగా కనిపిస్తున్నారు.
ఆమె ఫోటోలు "బ్లాక్ మ్యాజిక్" చేస్తున్నట్లు ఉన్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక కేవలం నటిగా మాత్రమే కాకుండా, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఆమె నిర్మాణ సంస్థ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై 'రాకాసా' (Raakaasaa) అనే ఫాంటసీ కామెడీ చిత్రాన్ని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.
అంతకుముందు 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఒకప్పుడు కథానాయికగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన నిహారిక.. ఇప్పుడు నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటూ నిర్మాణ రంగంలోనూ సక్సెస్ అయ్యారు.