ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. 40 ఏళ్ల వయసులో తగ్గని క్రేజ్.. ఇన్నాళ్లకు..

Rajitha Chanti

Pic credit - Instagram

18 April 2026

ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన నటనతో, అందంతో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె.

 ప్రభాస్ సరసన 'ఈశ్వర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. వీరిద్దరికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఫస్ట్ మూవీతోనే అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీదేవి.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించకపోయినా, బుల్లితెరపై , సోషల్ మీడియాలో రోజూ సందడి చేస్తూనే ఉన్నారు.

శ్రీదేవి విజయ్ కుమార్ వివాహం తర్వాత సినిమాలకు కొంత కాలం విరామం ఇచ్చారు. అయితే ఇటీవల ఆమె 'సుందరకాండ' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

కేవలం వెండితెరపైనే కాకుండా, పలు టీవీ రియాలిటీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు శ్రీదేవి విజయ్ కుమార్. 

ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫ్యామిలీ ఫోటోలు, ఫ్యాషన్ షూట్స్ కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

వైట్ లెహంగాలో అచ్చం దేవకన్యలా ముస్తాబైంది శ్రీదేవి విజయ్ కుమార్. ప్రస్తుతం ఆమె వయసు 39 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. 

ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది శ్రీదేవి. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.