AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. తండ్రి ఆర్మీలో డాక్టర్.. ఎవరో గుర్తుపట్టారా ?..

ఫోటోలో కనిపిస్తోన్న చిన్నారి గ్లోబల్ స్టార్ హీరోయిన్. ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన దంపతుల కూతురు. బాలీవుడ్, హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బీటౌన్ లోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?.

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. తండ్రి ఆర్మీలో డాక్టర్.. ఎవరో గుర్తుపట్టారా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2023 | 7:08 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తోన్న చిన్నారి గ్లోబల్ స్టార్ హీరోయిన్. ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన దంపతుల కూతురు. బాలీవుడ్, హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బీటౌన్ లోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఆమె చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్ననాటి ప్రియాంక చెట్టుపై సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా ఆర్మీలో డాక్టర్లుగా పనిచేశారు. ప్రియాంక 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అయితే చదువును వదిలేసి నటిగా కెరీర్‌ని ఎంచుకోవడాన్ని ఆమె తండ్రి వ్యతిరేకించారు. తన కూతురు హీరోయిన్ కావడానికి వీల్లేదని తెల్చీ చెప్పేశారు. ఈ విషయాన్ని గతంలో ప్రియాంక తల్లి మధు చోప్రా తెలిపారు.

ప్రియాంక తన హైస్కూల్ విద్య సమయంలో బోస్టన్ నుండి తిరిగి వచ్చింది. రెండు దేశాల్లోనూ విద్యలో వ్యత్యాసం కారణంగా ఆమె తన చదువుకు కొంత గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో ప్రియాంక పాల్గొంది. “మిస్ ఇండియా పోటీలో గెలవడమే ప్రియాంకలో అతిపెద్ద మార్పు అని. అందుకే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపింది మధుచోప్రా. కానీ ప్రియాంక తండ్రి మాత్రం తన కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించారని.. ప్రియాంక చదువులో నిష్ణాతురాలు. ఆమె అప్పుడు 12వ తరగతి పరీక్షకు సిద్ధమవుతోందని.. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె ఇతర పిల్లలతో చదువుకోవడానికి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. అందుకే మిస్ ఇండియాలో పాల్గొని విజేతగా నిలిచింది. తర్వాత మిస్ వరల్డ్ పోటీల కోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది’ అని మధు చోప్రా చెప్పారు.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మిస్ ఇండియా టైటిల్ ప్రియాంక జీవితంలో ఒక మైలురాయి. అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జీవిత ప్రయాణం ఓ కలలా సాగింది. ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటిగా రాణిస్తోంది. తన తండ్రి అశోక్ చోప్రా మరణం తర్వాత, తన తండ్రి గౌరవార్థం ప్రియాంక తన కుడి మణికట్టుపై పచ్చబొట్టు వేయించుకుంది. అశోక్ చోప్రా చేతిరాతను ప్రియాంక టాటూగా వేయించుకుంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.