AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చిన మణిరత్నం.. కమల్‌ సినిమాకు పొన్నియిన్‌ సెల్వన్‌ ఫార్ములా..!

పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ తరువాత ఈ సీనియర్ డైరెక్టర్ రూటు మార్చారు. తన రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా పీఎస్‌ 1, 2 సినిమాలను 150 రోజుల్లోనే పూర్తి చేసి ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామాలను కూడా నెలల తరబడి తీసే మణి, భారీ హిస్టారికల్ మూవీ కేవలం ఐదు నెలలో పూర్తి చేయటం అందరికీ షాక్ ఇచ్చింది.

రూటు మార్చిన మణిరత్నం.. కమల్‌ సినిమాకు పొన్నియిన్‌ సెల్వన్‌ ఫార్ములా..!
Mani Ratnam
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Oct 19, 2023 | 7:08 PM

Share

పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు సీనియర్ దర్శకుడు మణిరత్నం. అప్‌ కమింగ్‌ సినిమాల విషయంలోనూ ఆయన పీఎస్‌ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. గతంలో మణిరత్నం సినిమా అంటే షూటింగ్‌కు చాలా సమయం తీసుకునేవారు. మేకింగ్ పరంగా ప్రతీ విషయంలోనూ పర్టిక్యులర్‌ గా ఉండే మణి, షూటింగ్ టైమ్‌ లో ఏ మాత్రం కాంప్రమైజ్‌ అయ్యేవారు కాదు.

పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ తరువాత మణిరత్నం రూటు మార్చారు. తన రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా పీఎస్‌ 1, 2 సినిమాలను 150 రోజుల్లోనే పూర్తి చేసి ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామాలను కూడా నెలల తరబడి తీసే మణి, భారీ హిస్టారికల్ మూవీ కేవలం ఐదు నెలలో పూర్తి చేయటం అందరికీ షాక్ ఇచ్చింది. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అయిన మణిరత్నం, ప్రీ ప్రొడక్షన్ టైమ్‌ లోనే పక్కాగా షూటింగ్‌ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. యాక్టర్స్‌ డేట్స్‌, సెట్స్‌ లాంటి అన్ని పక్కాగా ఓకే అనుకున్న తరువాతే సెట్స్ మీదకు వెళ్లటంతో పొన్నియిన్ సెల్వన్‌ను షార్ట్ టైమ్‌ లో పూర్తి చేయగలిగారు. ఇప్పుడు తన అప్‌ కమింగ్ సినిమాల విషయం లోనూ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు మణి.

పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయిన వెంటనే లోక నాయకుడు కమల్‌ హాసన్ హీరోగా ఓ సినిమాను చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు మణిరత్నం. మూడున్నర దశాబ్దాల తరువాత ఈ కాంబినేషన్‌ లో సినిమా వస్తుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో నాయకుడు సినిమా కోసం కలిసి పనిచేశారు మణి, కమల్‌. ఆ తరువాత ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. ఇన్నేళ్ల తరువాత ఇద్దరు కలిసి వర్క్ చేస్తుండటం ఆడియన్స్‌ తో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ హైప్‌ పెంచేస్తోంది.

కమల్‌ తో చేయబోయే సినిమాను కూడా షార్ట్ టైమ్‌లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మణిరత్నం. ప్రజెంట్ ఇండియన్‌ 2, కల్కి సినిమాలతో పాటు హెచ్‌ వినోద్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు కమల్‌. ఈ సినిమాలన్నీ పూర్తయిన తరువాతే మణి సినిమా మొదలవుతుంది. అంటే కమల్‌, మణి కాంబో సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా టైముంది. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మీద ఫోకస్ పెట్టారు మణిరత్నం. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్‌. మరి మరోసారి మణి టార్గెట్ రీచ్ అవుతారేమో చూడాలి.