ఒకప్పుడు హోటల్‌లో వంటవాడు.. ఇప్పుడేమో 20 వంద కోట్ల హిట్స్ కొట్టిన ఏకైక హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
సినిమా నేపథ్యం ఉన్నా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఈ హీరో స్వయంకృషినే నమ్ముకున్నాడు. హీరో కాకముందు పాకెట్ మనీ కోసం పలు చిన్న ఉద్యోగాలు, పనులు చేశాడు. చివరకు ఓ హోటల్ లో వంటవాడిగా, క్యాటరింగ్ బాయ్ గా కూడా చేశాడు.

పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తు పట్టారా? అతను ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్. ఎంతలా అంటే.. ఒకప్పుడు సినిమాల సక్సెస్ కు ప్రామాణికంగా 50 రోజులు ఆడిందా? లేదా 100 రోజులు ఆడిందా? అని లెక్కలేసుకునేవారు. కానీ ఇప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేసిందా? 500 కోట్లు రాబట్టిందా? అని సినిమా సక్సెస్ ను లెక్కకడుతున్నారు. అలా ఈ స్టార్ హీరో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 వంద కోట్ల సినిమాల్లో నటించాడు. తద్వారా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా అవతరించాడు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ తదితర స్టార్ హీరోలకు కూడా వంద కోట్ల సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్టార్ హీరో తర్వాతనే..
అయితే ఈ హీరో సూపర్ స్టార్ కావడానికి ముందు చాలా కష్టపడ్డాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలు పనులు చేశాడు. బ్యాంకాక్ వెళ్లి అక్కడ వెయిటర్ గా, చెఫ్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం వెతికాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. సుమారు మూడున్నర దశాబ్దాలుగా భారతీయ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.
గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్న అక్షయ్ లేటెస్ట్ గా భూత్ బంగ్లా అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. గత వారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఈ జాబితాలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్ వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. తెలుగు హీరోల విషయానికి వస్తే 7 వంద కోట్ల సినిమాలతో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు.
భూత్ బంగ్లా సినిమాలో అక్షయ్ కుమార్..
Lomdi jaisi shakal, bachade jaisa dil aur sone jaisa insaan… @rajpalofficial love you brother! ♥️#BhoothBangla In Cinemas Now 👻
Book your tickets now: https://t.co/RYbn8mVSId pic.twitter.com/FWW5uETo6J
— Akshay Kumar (@akshaykumar) April 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




