AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కేవలం రూ.8 వేల పెట్టుబడి.. రూ.80 వేల ఆదాయం.. రైతు బిజినెస్‌ అదిరిందిగా..!

Business Idea: ప్రస్తుత రోజుల్లో రైతులలో 'తైవానీస్' రకానికి చెందిన ఈ సాగు పట్ల ఆసక్తి విపరీతంగా పెరిగింది. యూపీలోని బారాబంకి జిల్లాలోని బరేల్ గ్రామానికి చెందిన యువ రైతు బ్రిజేష్ యాదవ్ ఈ అధునాతన రకాన్ని సాగు చేస్తూ సక్సెస్ అయినట్లు చెబుతున్నాడు. ఈ తైవానీస్ రకం పంట ఇతర దేశీ రకాల కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి..

Business Idea: కేవలం రూ.8 వేల పెట్టుబడి.. రూ.80 వేల ఆదాయం.. రైతు బిజినెస్‌ అదిరిందిగా..!
Business Ideas
Subhash Goud
|

Updated on: Apr 28, 2026 | 11:18 AM

Share

Business Idea: సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడులు ఎక్కువ, లాభాలు తక్కువ అని చాలా మంది భావిస్తారు. కానీ, సంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్త రకం వంగడాలను సాగు చేస్తే అద్భుతమైన ఆదాయం పొందవచ్చని తైవాన్ సొరకాయ సాగు నిరూపిస్తోంది. తక్కువ సమయంలోనే చేతికి వచ్చే ఈ పంట రైతులకు కల్పవృక్షంలా మారుతోంది.

తైవాన్ సొరకాయ ప్రత్యేకతలు:

సాధారణ సొరకాయల కంటే తైవాన్ రకం సొరకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆకారం, నాణ్యత: ఇవి చూడటానికి ఆకర్షణీయంగా, ఒకే పరిమాణంలో ఉంటాయి. వీటి లోపల గుజ్జు ఎక్కువగా, గింజలు తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అధిక దిగుబడి విషయానికొస్తే.. తైవాన్ వంగడం తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడిని ఇస్తుంది. సాధారణ రకాలతో పోలిస్తే వీటి కాయలు ఎక్కువ సంఖ్యలో కాస్తాయి.

ఇది కూడా చదవండి: Gold Buying: భారతీయుల రూటు ఛేంజ్‌.. ఆ పని కోసమే 40% మంది బంగారం కొంటున్నారట.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు!

ఇవి కూడా చదవండి

తక్కువ పెట్టుబడి – త్వరిత ఆదాయం:

ఈ పంట కాలపరిమితి చాలా తక్కువ. విత్తిన 50 నుండి 60 రోజుల్లోనే కోతకు వస్తుంది. అంటే కేవలం రెండు నెలల్లోనే రైతుకు ఆదాయం మొదలవుతుంది. ఈ సాగుకు పెద్దగా రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదని, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేస్తే ఖర్చు ఇంకా తగ్గుతుందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు.

లాభాల లెక్కలివే:

ఎకరం విస్తీర్ణంలో ఈ సాగు చేపడితే, నాణ్యమైన విత్తనాలు, పందిరి ఏర్పాటు (మల్చింగ్ పద్ధతి), ఎరువుల కోసం సుమారు రూ. 30,000 నుండి 50,000 వరకు ఖర్చు అవుతుంది. దిగుబడి విషయానికి వస్తే.. ఎకరానికి టన్నుల కొద్దీ పంట వస్తుంది. మార్కెట్ ధరను బట్టి అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ. 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉంది.

రైతులకు సూచనలు:

  • మల్చింగ్ పద్ధతి: తీగ జాతి పంట కావడంతో పందిరి లేదా మల్చింగ్ పద్ధతిని వాడితే కాయలు నేలకు తగలకుండా నాణ్యంగా ఉంటాయి.
  • నీటి యాజమాన్యం: డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
  • మార్కెటింగ్: స్థానిక మార్కెట్లతో పాటు పట్టణాల్లోని సూపర్ మార్కెట్లకు నేరుగా సరఫరా చేస్తే మంచి ధర లభిస్తుంది. నీటి లభ్యత ఉండి, తక్కువ సమయంలో లాభాలు పొందాలనుకునే రైతులకు తైవాన్ సొరకాయ సాగు ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఆధునిక పద్ధతులు పాటిస్తే సామాన్య రైతు కూడా లక్షాధికారి కావచ్చని ఈ పంట నిరూపిస్తోంది.

ప్రస్తుత రోజుల్లో రైతులలో ‘తైవానీస్’ రకానికి చెందిన సొరకాయ సాగు పట్ల ఆసక్తి విపరీతంగా పెరిగింది. యూపీలోని బారాబంకి జిల్లాలోని బరేల్ గ్రామానికి చెందిన యువ రైతు బ్రిజేష్ యాదవ్ ఈ అధునాతన రకాన్ని సాగు చేస్తూ సక్సెస్ అయినట్లు చెబుతున్నాడు.ఈ తైవానీస్ రకం సొరకాయలు ఇతర దేశీ రకాల కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. అంతేకాకుండా మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు.

Bottle Gourd

Bottle Gourd

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా పతనం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us