AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి ఎదగడానికి నేను కారణం.. కావాలనే మా మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చిరంజీవి ఎదగడానికి నేను కారణం.. కావాలనే మా మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 10:19 AM

Share

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిరంజీవికి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవికి అభిమాన కానీ ప్రేక్షకులు ఉండరు. అంతలా నటనతో కట్టిపడేసారు చిరంజీవి. అయితే చిరంజీవి ఎదగడానికి ఒక విధంగా నేనే కారణం అని ఒకరు అన్నారు. ఆయన ఎవరో కాదు దిగ్గజ దర్శకుడు, నటుడు దర్శక రత్న దాసరి నారాయణరావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాసరి నారాయణరావు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినీ జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన అభిమాన నటుడిగా అక్కినేని నాగేశ్వరరావును, అభిమాన నటిగా సావిత్రిని, అభిమాన దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావును పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన, నేర్చుకోవాల్సిన నటుడిగా ఎన్టీఆర్ గారిని ఆయన అభివర్ణించారు దాసరి.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

తన తోటి దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో తనకు మధ్య ఉన్న పోటీతత్వాన్ని దాసరి వివరించారు. తమ ఇద్దరి మధ్య ఒక స్పోర్టివ్ స్ఫూర్తి ఉండేదని, అది రికార్డుల కోసం ఆరోగ్యకరమైన పోటీకి దారితీసిందని తెలిపారు. అయినా చిన్న మనస్పర్ధ గాని, విభేదం గాని రాలేదని దాసరి వెల్లడించారు. ప్రేమాభిషేకం చిత్రం గురించి మాట్లాడుతూ, అది ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని దాసరి గర్వంగా చెప్పారు. సింగిల్ థియేటర్‌లో ప్లాటినం జూబ్లీ, విడుదలైన అన్ని కేంద్రాల్లో వంద రోజులు, సిల్వర్ జూబ్లీ, అలాగే 20 కేంద్రాల్లో ఒక సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రంగా ప్రేమాభిషేకం నిలిచిందని తెలిపారు. రెవెన్యూ పరంగా బొబ్బిలి పులి రికార్డులు నెలకొల్పగా, రన్ విషయంలో ప్రేమాభిషేకం ముందుందని వివరించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

తన వృత్తి జీవితంలో ఎవరితోనైనా ఢీ కొనడానికి వెనుకాడలేదని, సందర్భం వచ్చినప్పుడు స్నేహంగా ఉంటారని, అవసరమైతే బస్తీ మే సవాల్ అంటారని దాసరి తన స్వభావాన్ని వివరించారు. అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు తీసినప్పటికీ, ఒకానొక దశలో వారి మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తాయని అన్నారు దాసరి. ఆ పరిస్థితి వల్ల తాను ఆయనతో పని చేయడం మానుకున్నానని, అయితే ఆయన పట్ల గౌరవం తగ్గలేదని, ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని దాసరి స్పష్టం చేశారు. వారిద్దరూ కళ్లు కలపలేని పరిస్థితి వాస్తవమే అని, దాంట్లో ఎలాంటి హిపోక్రసీ లేదని, ఆ పరిస్థితి తన మనసుకి కష్టం కలిగించిందని దాసరి వెల్లడించారు. అయితే, మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడూ ఘర్షణ పడలేదని,  అభిప్రాయ భేదాలు కూడా లేవని దాసరి అన్నారు, చిరంజీవి ఎదుగుదలకు పరోక్షంగా నేను ఎలా ఉపయోగపడ్డానో అతనికి తెలుసు, అతని కుటుంబానికి తెలుసు, పైగా చిరంజీవి తనకు బంధువు అవుతాడని అన్నారు.అంతే కాదు చిరంజీవిని చాలా ఎంజారేజ్ చేశావాడిని అని దాసరి నారాయణరావు తెలిపారు. రాజకీయాల సమయంలో మా మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు అని దాసరి నారాయణ రావు అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us