కుజదోష పరిహారాలు..
ఈ దోషాన్ని తగ్గించడానికి కొన్ని ఆచారాలు సూచించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి:
షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, స్తోత్రాలు పారాయణం చేయడం, మంగళవారాల్లో ఉపవాసం ఉండి కుజ సంబంధిత మంత్రాలు జపించడం, కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయడం,
ఎర్రని పూలతో పూజలు చేయడం, ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేయడం, పగడపు ఉంగరం ధరించడం, సుబ్రహ్మణ్య, దుర్గాదేవి స్తోత్రాలు చదవడం,
సంతానం కోరుకునే వారు ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం, ఆవు పాలతో అభిషేకాలు చేయించడం,
ఆంజనేయ స్వామి ఆరాధన, సింధూర పూజ చేయించడం, సుందరకాండ పారాయణం చేయడం..
ఈ విధమైన పరిహారాలు విశ్వాసాల ఆధారంగా సూచించబడినవి. వీటితో పాటు వ్యక్తిగతంగా ప్రయత్నం, సమయోచిత నిర్ణయాలు కూడా అవసరం. అప్పుడే మంచి ఫలితాలు పొందవచ్చని గుర్తుంచుకోవాలి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)