AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: అక్కడి అమ్మవారు చాలా పవర్‌ఫుల్.. ఆ గుడికి వెళ్లాకే నా లైఫ్ మారిపోయింది..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.కెరీర్ బిగినింగ్ లో హిట్ కోసం కష్టపడ్డ ఈ చిన్నదానికి ఇప్పుడు వరుస హిట్స్ వస్తున్నాయి. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది

Shruti Haasan: అక్కడి అమ్మవారు చాలా పవర్‌ఫుల్.. ఆ గుడికి వెళ్లాకే నా లైఫ్ మారిపోయింది..
Shruthi Haasan
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2026 | 7:36 AM

Share

సినిమా ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో సింగర్ గా చేసిన ఈ అమ్మడు ఆతర్వాత హీరోయిన్ గీతా మారిపోయింది. అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది. అంతే ఆ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. వరుస సినిమాలతో బిజీ అయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ..

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

కేవలం హీరోయిన్ గానే కాదు సింగర్ గాను ప్రతిభ చాటుకుంటుంది శ్రుతిహాసన్. ఇటీవలే వారణాసి సినిమా కోసం  సంచారి అనే సాంగ్ పాడింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది శ్రుతిహాసన్. ఆమధ్య శ్రుతి రెండుసార్లు ప్రేమలో పడింది. కానీ ప్రేమ ఈ అమ్మడికి కలిసిరాలేదనే చెప్పాలి.. దాంతో తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నా అంటూ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతి తన భక్తి భావన గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

ఇటీవల శ్రుతిహాసన్ అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండ పై ఉన్న కామాఖ్యా టెంపుల్( వారాహి అమ్మవారు) ను దార్శించుకుంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని శ్రుతి చెప్పుకొచ్చింది. ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు.దేవుళ్ళు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నన్ను టెంపుల్ కు వెళ్దాం రా అని పిలిచాడు. సరే అని వెళ్ళా.. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. ఆశ్చర్యంగా అనిపించింది. వారాహి అమ్మవారు శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి