Tollywood: పాన్ ఇండియా స్టార్ హీరో అయినా.. కూతురి ప్రేమకు బానిసే.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

పాన్ ఇండియా స్టార్ హీరో. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించాయి. నటనపై ఇష్టంతో ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సీరియల్స్ చేసిన అతను ఆ తర్వాత హీరోగా బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు. ప్రస్తుతం ఆయన చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: పాన్ ఇండియా స్టార్ హీరో అయినా.. కూతురి ప్రేమకు బానిసే.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actor

Updated on: Sep 10, 2023 | 4:03 PM

పైన ఫోటోలో బీచ్ లో కూతురితో కలిసి ఆటలాడుతున్న ఆ హీరోను గుర్తుపట్టగలరా ?.. పాన్ ఇండియా స్టార్ హీరో. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించాయి. నటనపై ఇష్టంతో ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సీరియల్స్ చేసిన అతను ఆ తర్వాత హీరోగా బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు. ప్రస్తుతం ఆయన చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.. అతనే కేజీఎఫ్ స్టార్ యశ్. ఈ పేరు చెబితే గుర్తుపట్టనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 1,2 చిత్రాలతో రాకీ భాయ్‏గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈ రెండు చిత్రాలు యశ్ కెరీర్ ను పూర్తిగా మార్చేశాయి.

అయితే ఈ రెండు చిత్రాల తర్వాత యశ్ సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. చాలా రోజులుగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇటీవలే ఫ్యామిలీలో ఎంతో ఘనంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఆయన సతీమణి రాధికా పండిట్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు. తాజాగా రాధికా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ఫోటోలో యశ్ తన కూతురు ఐరాతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీచ్ లో రాధిక పండిట్, యశ్ కూర్చొని ఉండగా.. ఆయన కూతురు ఐరా యశ్ భూజాలపై కూర్చుంది. ఈఫోటోను రాధిక తన ఇన్ స్టాలో షేర్ చేయగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యశ్, రాధిక కలిసి నందగోకుల సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2016లో ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా.. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత రాధిక మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం ఆమె తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ 1,2 చిత్రాల తర్వాత యశ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అటు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా యశ్ అంగీకరించడం లేదు. దీంతో ఆయన తదుపరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.