Tollywood: హాలీవుడ్ హీరో స్టైల్‏లో సౌత్ ఇండియన్ స్టార్.. స్టైలీష్‏ లుక్‏లో షాకిచ్చిన హీరో.. గుర్తుపట్టగలరా ?..

మొన్నటి వరకు హాలీవుడ్ రేంజ్ కటౌట్ హీరోగా కనిపించి.. ప్రస్తుతం తన సినిమా కోసం ఒక తెగకు సంబంధించిన వ్యక్తిలా మారిపోయడం. ఇన్నాళ్లు గుర్తుపట్టలేని విధంగా కనిపించిన ఆ స్టార్.. ఇప్పుడు ఊహించని స్టైల్లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూశారు కదా.. అతడు సౌత్ ఇండియా స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. వయసు పెరిగిన హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టరా ?.

Tollywood: హాలీవుడ్ హీరో స్టైల్‏లో సౌత్ ఇండియన్ స్టార్.. స్టైలీష్‏ లుక్‏లో షాకిచ్చిన హీరో.. గుర్తుపట్టగలరా ?..
Actor
Follow us

|

Updated on: Feb 12, 2024 | 11:05 AM

సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. కథ నచ్చితే చాలు.. పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు. ఎన్నో రకాల పాత్రలలో జీవించేస్తాడు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రోల్ డిమాండ్ చేస్తే బరువు పెరగడం.. లేదా తగ్గడం తనకు అలవాటే. మొన్నటి వరకు హాలీవుడ్ రేంజ్ కటౌట్ హీరోగా కనిపించి.. ప్రస్తుతం తన సినిమా కోసం ఒక తెగకు సంబంధించిన వ్యక్తిలా మారిపోయడం. ఇన్నాళ్లు గుర్తుపట్టలేని విధంగా కనిపించిన ఆ స్టార్.. ఇప్పుడు ఊహించని స్టైల్లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూశారు కదా.. అతడు సౌత్ ఇండియా స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. వయసు పెరిగిన హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టరా ?.. కొత్త ఫోటలోతో నెట్టింట అగ్గిరాజేస్తున్నాడు. అతడే కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్.

ప్రస్తుతం తంగళాన్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్ మూవీపై మరింత హైప్ పెంచాయి. ఈ మూవీని త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. అలాగే ధృవ నచ్చితిరం.. చాప్టర్ 1 యుద్ధ కాండమ్ సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం ఊహించని గెటప్ లో కనిపించిన విక్రమ్.. ఇప్పుడు స్టైలీష్ గా కనిపిస్తున్నారు. అందుకు కారణం నెటితో ‘మహాన్’ సినిమా రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన ఇన్ స్టాలో సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తన కొత్త స్టైలీష్ ఫోటోలను షేర్ చేశారు. “మహాన్ 2!!? ” అంటూ రాసుకొచ్చారు. దీంతో మహాన్ సెకండ్ పార్ట్ రాబోతుందంటూ ఆసక్తిని చూపిస్తున్నారు అడియన్స్.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, విక్రమ్ చియాన్ కాంబోలో వచ్చిన మహాన్ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మహాన్ తరహా మ్యాజిక్ మరోసారి చియాన్ నుంచి కావాలని కోరకుంటున్నారు. అయితే విక్రమ్ ఇచ్చిన హింట్ చూస్తే త్వరలోనే మహాన్ 2 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. 2022లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విక్రమ్ చియాన్, సిమ్రాన్, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, దీపక్ పరమేష్ కీలకపాత్రలు పోషించారు.

View this post on Instagram

A post shared by Vikram (@the_real_chiyaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.