Keerthy Suresh: అతడు రాసిన ప్రేమలేఖను ఇంకా భద్రంగా దాచుకున్న కీర్తి.. అందులో ఏముందంటే..
దసరా సినిమాలో కనిపించింది. ఇందులో వెన్నెల పాత్రలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తన అద్భుతమైన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళం, తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. హిందీలో రీమేక్ అవుతున్న థేరీ మూవీలో కీర్తి కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ నటించనున్నాడని సమాచారం.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు.. అంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. తెలుగులో చివరగా దసరా సినిమాలో కనిపించింది. ఇందులో వెన్నెల పాత్రలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తన అద్భుతమైన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళం, తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. హిందీలో రీమేక్ అవుతున్న థేరీ మూవీలో కీర్తి కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ నటించనున్నాడని సమాచారం. కీర్తికి యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికీ తెలుగు కుర్రకారు ఫేవరేట్ క్రష్ ఈ ముద్దుగుమ్మే.
ఇప్పటికే ఈ బ్యూటీకి వేలల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఎన్నో రకాల తమ ప్రేమను బయటపెట్టేందుకు ట్రై చేసిన వారుంటారు. కానీ ఇప్పటికీ కీర్తి వద్ద మాత్రం ఓ ప్రేమలేఖ ఉందట. దానిని ఎంతో భద్రంగా దాచుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తుంది. ఈ క్రమంలో నెట్టింట తారల లవ్ స్టోరీ ముచ్చట్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. ఓ వ్యక్తి రాసిన ప్రేమలేఖను ఇప్పటికీ దాచుకున్నానంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది కీర్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా ?.. అతడెవరో తనకు కూడా తెలియదంటుంది కీర్తి. కానీ తన జీవితంలో వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ కావడంతో జాగ్రత్తగా దాచుకున్నానని తెలిపింది.
‘కెరీర్ ఆరంభంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం వెళ్లాను. అప్పటికే నేను వస్తున్నాను అన్న సంగతి తెలిసి అక్కడి చాలా మంది చేరుకున్నారు. ఇంతలో ఆ గుంపులో నుంచి ఓ అబ్బాయి ముందుకు వచ్చాడు. వస్తూనే నా చేతిలో ఓ పెద్ద పుస్తకం పెట్టాడు. ఆ సమయంలో నన్ను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయలేదు. చేతిలో పుస్తకం పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందులో నాకు సంబంధించిన ఫోటోలతోపాటు ఓ ఉత్తరం ఉంది.. తనను పెళ్లి చేసుకోమని ఆ అబ్బాయి రాసిన ప్రేమలేఖ చూసాను. అందులో తన వివరాలు కూడా ఉన్నాయి. అబ్బాయి ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయి. ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. కాసేపటికి నవ్వుకున్నాను. ఫస్ట్ లవ్ లెటర్ కావడంతో ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా దాచుకున్నాను.కాలేజీ రోజుల్లో నాకు ఎవరు ప్రేమలేఖలు రాయలేదు ‘ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.