Meenakshi Chaudhary: ఈ అందాల రాశికి ఇన్ని టాలెంట్సా… మీనాక్షి మీరు గ్రేట్ అంతే..

ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఇందులో మీనాక్షి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి జోడిగా ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈ బ్యూటీ చెంతకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Meenakshi Chaudhary: ఈ అందాల రాశికి ఇన్ని టాలెంట్సా... మీనాక్షి మీరు గ్రేట్ అంతే..
Meenakshi Chaudhary
Follow us

|

Updated on: Feb 12, 2024 | 9:29 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరీ ఒకరు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమాలో కనిపించింది. ఇందులో అడివి శేష్ జోడిగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఇందులో మీనాక్షి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి జోడిగా ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈ బ్యూటీ చెంతకు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. మీనాక్షి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మల్టీటాలెంటెడ్ కూడా. హర్యానాలోని పంచ్ కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి.. డెంటిస్ట్. నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటర్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. డెంటల్ సర్జరీ మూడవ సంవత్సంరలో ఉండగానే.. 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే 2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుంది ఈ బ్యూటీ..

మోడలింగ్ రంగంలోనే కాదు.. క్రీడల్లోనూ ఈ బ్యూటీకి సాటి లేరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను స్టేట్ లెవల్ స్విమ్మర్.. స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని.. అలాగే డెంటిస్ట్ .. మోడల్.. హీరోయిన్ అంటూ తన క్వాలీఫికేషన్స్ చెప్పుకొచ్చింది మీనాక్షి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో మీనాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా ?.. మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త