Anand Deverakonda: బ్రేకప్‌ బాధ నుంచి బయటపడేందుకు ఐదేళ్లు పట్టింది..: ఆనంద్ దేవరకొండ.

Anand Deverakonda: బ్రేకప్‌ బాధ నుంచి బయటపడేందుకు ఐదేళ్లు పట్టింది..: ఆనంద్ దేవరకొండ.

Anil kumar poka

|

Updated on: Feb 12, 2024 | 10:00 AM

దొరసాని సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, బేబీ మూవీతో బ్లాక్‌బ్లస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్, బ్రేకప్ విషయాన్ని పంచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు.

దొరసాని సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, బేబీ మూవీతో బ్లాక్‌బ్లస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్, బ్రేకప్ విషయాన్ని పంచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని భావించానని అన్నాడు. అందుకోసం షికాగోలోని టాప్-5 ఇంజినీరింగ్ కాలేజీలకు దరఖాస్తు చేసుకుంటే ఒక దాంట్లో సీటు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్నానని, కానీ కథ అడ్డం తిరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికెళ్లాక వ్యవహారం బెడిసికొట్టిందని, తన గుండె పగిలిందని చెప్పుకొచ్చాడు. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు తనకు ఏకంగా నాలుగైదేళ్లు పట్టినట్టు వివరించాడు. తాను నిజాయితీగా ప్రేమించినా ఫలితం లేకుండా పోయిందని, అది తనను చాలా బాధపెట్టిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..