AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు హీరో.. ఇప్పుడు డైరెక్టర్..! తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు

చాలా మంది దర్శకులు ఒకప్పుడు సినిమాలు నటించి మెప్పించారు. తమ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే కొంతమంది దర్శకులు ఒకప్పుడు హీరోలుగా సినిమాలు కూడా చేశారు. ఇక ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఓ స్టార్ దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు.

అప్పుడు హీరో.. ఇప్పుడు డైరెక్టర్..! తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు
Premalekha Raasa
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2025 | 4:46 PM

Share

సినిమా చాలా మంది దర్శకుల నుంచి నటులుగా మారారు మరికొంతమంది నటుల నుంచి దర్శకులుగా మారారు. అలాగే పై ఫొటోలో అంజలితో ఉన్న నటుడు కూడా ఇప్పుడు దర్శకుడిగా రాణిస్తున్నాడు. అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటడ్ మూవీస్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ లో ఈ అమ్మడు నటించిన షాపింగ్ మాల్ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఈ సినిమాతో అంజలి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది.

ఇటీవలే ఈ అమ్మడు 50 సినిమాలను పూర్తి చేసింది. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో అంజలి 50 సినిమాలు పూర్తి చేసింది. ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గానూ.. స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది ఈ బ్యూటీ. ఇక పై ఫొటోలో అంజలితోపాటు ఉన్న దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఇంతకు పై ఫొటోలో ఉన్న దర్శకుడు ఎవరంటే..

ఇవి కూడా చదవండి

పై ఫోటోలో అంజలితో పాటు ఉన్న దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన మరెవరో కాదు బింబిసార సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట. దర్శకుడిగా అడుగుపెట్టక ముందు వశిష్ట పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. మొదట్లో నా ఆటోగ్రాఫ్ (2004), సఖియా (2004), భగీరథ (2005), బన్నీ (2005), ఢీ (2007), వెంకటేష్ బాడీగార్డ్ (2012) ఇలా అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అలాగే  ప్రేమలేఖ రాసా (2007) అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఆ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా బింబిసార సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా ఫాంటసీ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నాడు వశిష్ట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు