Tollywood: కాశీలో రోజాతో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడేంటిలా మారిపోయింది

ప్రముఖ టాలీవుడ్ నటి, మాజీ మంత్రి రోజా ఇటీవల కాశీ యాత్రకు వెళ్లింది. అక్కడ కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే రోజా వెంట జబర్దస్త్ రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత దంపతులతో పాటు గతంలో ఒక వెలుగు వెలిగిన టాలీవుడ్ హీరోయిన్ కూడా కనిపించింది.

Tollywood: కాశీలో రోజాతో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడేంటిలా మారిపోయింది
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 6:03 PM

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కాశీ యాత్రకు వెళుతున్నారు. అక్కడి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఇటీవల రణ్ బీర్ కపూర్- అలియా భట్, రాశీ ఖన్నా, సురేఖ వాణి కూతురు సుప్రిత తదితరులు కాశీ యాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా మాజీ మంత్రి, నటి రోజా కాశీ యాత్రకు వెళ్లింది. ఆమెతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత దంపతులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమ కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. అందుకు కారణం ఆ ఫొటోల్లో రోజాతో పాటు కనిపించిన మరో టాలీవుడ్ హీరోయిన్. బొద్దుగా ఉన్న ఆమెను చూసి మొదట చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత ఆ బొద్దుగుమ్మ ఒకప్పటి టాలీవుడ్ ముద్దుగుమ్మ అని తెలుసుకుని షాక్ అయ్యారు. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? పెళ్లి సందడి సినిమాతో బాగా ఫేమస్ అయిన రవళి. పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఆమె చాలా రోజుల తర్వాత కాశీలో కనిపించింది. అయితే ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయిందామె.

ఏపీలోని గుడివాడలో పుట్టి పెరిగిన రవళి తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషా సినిమాల్లోనూ నటించింది. 1990లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆలీబాబా అరడజను దొంగలు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పెళ్లి సందడి సినిమాతో రవళి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వినోదం, ఒరేయ్ రిక్షా, శుభాకాంక్షలు తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

రోజాతో కలిసి కాశీ యాత్రలో రవళి..

హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన రవళి 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు, నీలకృష్ణను వివాహం చేసుకుంది. 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.

Actress Ravali

Actress Ravali

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?