AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasturi: అనసూయను ఆంటీ అని పిలవడంపై ‘గృహలక్ష్మి’ నటి ఫైర్.. ఏజ్డ్ హీరోలను అంకుల్స్ అంటారా ? అంటూ సూటి ప్రశ్న..

తాజాగా ఈ కామెంట్స్ పై గృహలక్ష్మి నటి కస్తూరి శంకర్ స్పందించింది. తమను ఆంటీని అని పిలిస్తే ఏజ్డ్ హీరోలను అంకుల్స్ అని పిలుస్తారా ? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Kasturi: అనసూయను ఆంటీ అని పిలవడంపై 'గృహలక్ష్మి' నటి ఫైర్.. ఏజ్డ్ హీరోలను అంకుల్స్ అంటారా ? అంటూ సూటి ప్రశ్న..
Kasturi Shankar
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2023 | 10:44 AM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోలింగ్స్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇండస్ట్రీలోని నటీమణులపై నెగిటివిని ప్రచారం చేస్తూ దారణంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే వీటిని కొందరు చూసి చూడనట్టుగా వదిలేస్తే.. మరికొందరు మాత్రం వెంటనే రియాక్ట్ అవుతుంటారు. అలాంటి జాబితాలో యాంకర్ అనసూయ, యాంకర్ రష్మీ ముందుంటారు. తమపై వచ్చే ట్రోలింగ్స్ పట్ల ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్స్ ఇస్తుంటారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం యాంకర్ అనసూయను ఆంటీ అంటూ ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ పై అనసూయ కూడా స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ పై గృహలక్ష్మి నటి కస్తూరి శంకర్ స్పందించింది. తమను ఆంటీని అని పిలిస్తే ఏజ్డ్ హీరోలను అంకుల్స్ అని పిలుస్తారా ? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది.

“ఒక చిన్న పిల్ల వచ్చి పిలవడానికి.. దున్నపోతులా ఉన్న వ్యక్తి వచ్చి ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంది. చిన్న పిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచేందుకు హక్కు లేదు. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళైనా ఆంటీ అని పిలవడం చిన్న పిల్లలకు కరెక్ట్. అడల్ట్స్ ఎవరైనా అలా పిలిచారంటే అది ఖచ్చితంగా ఆగౌరవపరచడమే. హీరో లేదా నటుడి దగ్గరకు వెళ్లి అంకుల్ అని పిలుస్తారా ?. నిజానికి ఆంటీ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అదేం లేదు. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలవగలరా ? ముమ్మాటికి ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ చేస్తాను” అని చెప్పింది.

మేడమ్ అని సిస్టర్ లేదా అమ్మా అని పిలవండి అని తెలిపింది. ఇన్ స్టా చాటింగ్ లో అభిమానులు తమతో కాస్త్ లైన్ క్రాస్ చేసే కామెంట్లకు చాలాసార్లు హ్యూమరస్ గా ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అయినప్పటికీ కొందరు శ్రుతి మించి చేస్తే అలాంటి యూజర్లను బ్లాక్ చేస్తాను. అంతకన్నా వేరే మార్గం లేదు అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.