Pakka Commercial Mega Macho Event : అంగరంగ వైభవంగా ‘పక్కా కమర్షియల్’ మెగామ్యాచో ఈవెంట్

మ్యాచో హీరో గోపీచంద్ నటింస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Pakka Commercial Mega Macho Event : అంగరంగ వైభవంగా 'పక్కా కమర్షియల్' మెగామ్యాచో ఈవెంట్
Pakka Commercial Mega Macho
Follow us

|

Updated on: Jun 26, 2022 | 7:11 PM

మ్యాచో హీరో గోపీచంద్ నటింస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్(Pakka Commercial). సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.. కామెడీ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో గోపిచంద్  లాయర్ గా కనిపించబోతున్నారు.. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలై 1న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా  నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఇక కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు.. ఈ సినిమాలో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి