Sitara: ఆ రోజు నాన్న నన్ను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు.. ఆసక్తికర విషయం చెప్పిన సితార
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. దాంతో ఫ్యాన్స్ చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఎరిపోర్టు లో కనిపించిన ఫోటోలు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ గారాలపట్టి సితార ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.
రీసెంట్ గా మహేష్ కూతురు సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా. పంచుకుంది తన తండ్రి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని అమ్మ మాత్రం చాల స్ట్రిక్ట్ గా ఉంటుందని తెలిపింది. అలాగే తన తండ్రి షూటింగ్స్ నుంచి వస్తే తాను స్కూల్‌కు బంక్ కొడతాను అని తెలిపింది. అలాగే ఏఎంబీ మాల్ లో ఎక్కువగా సినిమాలు చూస్తాను అని తెలిపింది. అలాగే మహేష్ బాబు తనను చూసి ఏడ్చేసినంత పని చేశారని తెలిపింది.
ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే
సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పీఎంజే అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. పీఎంజే బ్రాండ్ కి ఓ యాడ్ కూడా చేసింది సితార. అయితే ఆ యాడ్ చూసిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారట. దీని గురించి సితార మాట్లాడుతూ.. ‘నా పీఎంజే యాడ్ చూసిన తర్వాత నాన్న ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా యాడ్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యింది’ అని తెలిపింది. అలాగే ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ను ఓ ఛారిటీకి ఇచ్చినట్టు గతంలో తెలిపింది సితార. కాగా మహేష్ బాబుకు సితారకు మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్, సితార ఇద్దరూ కలిసున్నా క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.