Allu Arjun: గద్దర్ ఫిలిం అవార్డులపై స్పందించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఏమన్నారంటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. కల్కి, లక్కీ భాస్కర్, రజాకార్ చిత్రాలకు పురస్కారాల పంట పండింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , పుష్ప2కి అవార్డు దక్కింది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను ఇవ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. కల్కి, లక్కీ భాస్కర్, రజాకార్ చిత్రాలకు పురస్కారాల పంట పండింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , పుష్ప2కి అవార్డు దక్కింది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందివ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది. విభజనకు కొన్నేళ్ల ముందు నుంచి సినిమా పురస్కారాలు పెండింగ్‌లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ, జ్యూరీ సభ్యులు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. అవార్డుల విజేతలకు అభినందనలు తెలియ జేశారు.గద్దర్ అవార్డులపై స్పందించారు నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాఅంటూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. తనకు అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలదే అన్నారు . గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా అన్న అల్లు అర్జున్…అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు.. తనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే గద్దర్ అవార్డులకు ఎంపి అయిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.
ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
I am truly honoured to receive the first Best Actor award for #Pushpa2 at the #GaddarTelanganaFilmAwards 2024.
Heartfelt thanks to the Government of Telangana for this prestigious honour .
All credit goes to my director Sukumar garu, my producers, and the entire Pushpa team.
I…
— Allu Arjun (@alluarjun) May 29, 2025
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..
Congratulations to all the winners of the Gaddar Telangana Film Awards 2024. It’s truly heartwarming to see the Government of Telangana take this initiative starting this year.
Also, congrats to Ganesh Acharya ji on winning the Best Choreographer award for his work in Devara.
— Jr NTR (@tarak9999) May 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







