AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు డైరెక్టర్ అని తెలిసి అలా చేశాడట..! స్టార్ హీరో చేసిన పనికి బాధపడ్డ గోపిచంద్ మలినేని..

మాస్ మహారాజ రవితేజ నటించిన డాన్ శ్రీను సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు గోపీచంద్ మలినేని. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ స్టార్ దర్శకుడు. చేసింది తక్కువ సినిమాలే కానీ మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. యాక్షన్ దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి మార్క్ క్రియేట్ చేశారు గోపిచంద్.

తెలుగు డైరెక్టర్ అని తెలిసి అలా చేశాడట..! స్టార్ హీరో చేసిన పనికి బాధపడ్డ గోపిచంద్ మలినేని..
Gopichand Malineni
Rajeev Rayala
|

Updated on: May 29, 2025 | 5:19 PM

Share

టాలీవుడ్ లో మాస్ దర్శకుల లిస్ట్ లో ముందు వరసలో ఉంటారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. గోపిచంద్ మలినేని మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టక ముందు అసిటెంట్ దర్శకుడిగా పలువురి దగ్గర పని చేశారు గోపిచంద్ మలినేని. ఇవివి సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగ దాస్, శ్రీవాస్ , మెహర్ రమేష్‌లాంటి దర్శకుల దగ్గర అసిటెంట్ డైరెక్టర్ గా చేశారు గోపిచంద్ మలినేని. ఇక దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి వరుస హిట్స్ అందుకున్నారు. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యాక్షన్ దర్శకుడి.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

డాన్ శీను, బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆతర్వాత వచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు గోపిచంద్. సన్నీడియోల్ తో కలిసి జాట్ అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్ మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో తనకు నో చెప్పాడని తెలిపారు. తెలుగు దర్శకుడిని కావడంతో నాకు ఆ హీరో నో చెప్పాడు అని తెలిపారు గోపీచంద్.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.  గోపిచంద్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత దళపతి విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నారట. ఈ మేరకు విజయ్‌ను కలిసి కథ కూడా చెప్పారట. విజయ్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేశారట.. అయితే అప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఆ సమయంలో తెలుగు దర్శకుడితో సినిమా చేయడం అవసరమా అని ఎవరో విజయ్ కు చెప్పారట. అప్పటికే విజయ్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశారు. దాంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సమయంలో మరో తెలుగు దర్శకుడితో చేయకూడదని విజయ్ భావించి నో చెప్పారట.. తెలుగువాడిని అని  విజయ్ నాతో సినిమా చేయనన్నారు అని చెప్తూ గోపిచంద్ ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us