Vijay Devarakonda: ఇక పై నానీని అన్నా అనే పిలుస్తాను.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ పురస్కారం ఇచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నానితో కలిసి పనిచేసిన ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ పరంగా నాని తనకు చాలా సాయం చేశారని.. అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇకపై నానీని అన్నా అనే పిలుస్తానంటూ చెప్పుకొచ్చారు.

Vijay Devarakonda: ఇక పై నానీని అన్నా అనే పిలుస్తాను.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు..
Nani, Vijay
Follow us

|

Updated on: Sep 15, 2024 | 2:24 PM

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) SIIMA 2024 వేడుకలు శనివారం దుబాయిలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి దసరా, బేబీ, హాయ్ నాన్న చిత్రాలు వరుస అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని అవార్డ్ దక్కించుకున్నారు. అయితే ఈ అవార్డును టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందించారు. ఈ పురస్కారం ఇచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నానితో కలిసి పనిచేసిన ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ పరంగా నాని తనకు చాలా సాయం చేశారని.. అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇకపై నానీని అన్నా అనే పిలుస్తానంటూ చెప్పుకొచ్చారు.

“ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ మూవీకి ఆడిషన్ ఇచ్చేందుకు నాని ఆఫీస్ కు వెళ్లాను. ఆయనతో ఆడిషన్ అని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. అలాగే కాస్త కంగారుపడ్డాను కూడా. నటీనటులు ఎవరికైనా తొలి చిత్రం ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఎన్నో మధుర జ్ఞాపకాలు అందిస్తుంది. ఆ సమయంలో నాని చాలా సపోర్ట్ చేశారు. నానీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. నీపై నాకు అమితమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. నేను ఇండస్ట్రీలోని అందరినీ అన్నా.. అన్నా అని పిలుస్తుంటాను.. కానీ ఎందుకు పిలుస్తున్నానో నాకే తెలియదు. ఇక ఈరోజు నుంచి నిన్ను నాని అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస విజుయాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీకు అవార్డ్ అందించడం కూడా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

అనంతరం నాని మాట్లాడుతూ.. “విజయ్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి వర్క్ చేసినప్పుడు సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడూ ఏదో ఆకటి నేర్చుకోవాలనే తపన ఉన్న వ్యక్తి అతడు. వచ్చే ఏడాది ఇదే స్టేజ్ పై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డ్ ఇస్తాను.. నువ్వు ఫిక్స్ అయిపో” అంటూ చెప్పుకొచ్చారు. నాని, విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవిక నాయర్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల నట వేడుకలలోనూ నాని, విజయ్ స్టేజి మీద హగ్ చేసుకుని మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో