Tollywood: ఓర్నీ.. స్టేజ్ పై యాంకరింగ్ ఇలా చేస్తారా..? ఇన్నాళ్లు తెలియదే.. రానా వీడియో చూశారా..?
నార్మల్ గా రియాల్టీ షోలలో యాంకరింగ్ చేయడం వేరు.. కానీ వందల మంది ముందు స్టేజ్ మీద నిలబడి లైవ్ లో ఈవెంట్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. తెలుగులో కొందరు యాంకర్స్ స్టేజ్ పై నిలబడితే ప్రేక్షకులను తెలియని ఆసక్తి కలుగుతుంది. యాంకర్ సుమ, ప్రదీప్, సుడిగాలి సుధీర్ స్టేజ్ పై తమ కామెడీ టైమింగ్, పంచులతో అదరగొట్టేస్తుంటారు. ఈవెంట్లో అడియన్స్ ఏమాత్రం విసుగు చెందకుండా
యాంకరింగ్.. చాలా మందికి ఫ్యాషన్. టీవీల్లో కాకుండా స్టేజ్ పై నిలబడి అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులకు క్షణం కూడా బోర్ కొట్టించకుండా చూసుకోవాల్సిందే. అయితే నార్మల్ గా రియాల్టీ షోలలో యాంకరింగ్ చేయడం వేరు.. కానీ వందల మంది ముందు స్టేజ్ మీద నిలబడి లైవ్ లో ఈవెంట్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. తెలుగులో కొందరు యాంకర్స్ స్టేజ్ పై నిలబడితే ప్రేక్షకులను తెలియని ఆసక్తి కలుగుతుంది. యాంకర్ సుమ, ప్రదీప్, సుడిగాలి సుధీర్ స్టేజ్ పై తమ కామెడీ టైమింగ్, పంచులతో అదరగొట్టేస్తుంటారు. ఈవెంట్లో అడియన్స్ ఏమాత్రం విసుగు చెందకుండా చూసుకుంటారు. అయితే మాట తడబడకుండా లైవ్ షోలలో మాట్లాడాలంటే ఎంతో ముందు చూపు, ధైర్యం ఉండాలి. అయితే లైవ్ వేడుకలలోనూ కొన్నిసార్లు ప్రాంప్టింగ్ ఉంటుందట. కేవలం టీవీలలో షోలలో ప్రాంప్టింగ్ ఉంటుందని తెలుసు కదా.. కానీ లైవ్ షోలోనూ ప్రాంప్టింగ్ అంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
నిన్న దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో రానా హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రానా మాట్లాడుతుంటే ఎదురుగా కొద్ది దూరంలో ప్రాంప్టింగ్ ఉంది. అక్కడ తెలుగులో రానా మాట్లాడాల్సిన మాటలు ఎదురుగా ప్రాంప్టింగ్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. లైవ్ షోలో హోస్టింగ్ కోసం ప్రాంప్టింగ్ ఉంటుందని తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇన్ని రోజులు యాంకర్స్ అంతా గుర్తుపెట్టుకుని మాట్లాడతారని అనుకున్నాం. ఇలా చూస్తూ చదువుతుంటారా.. పోయాం మోసం.. అంటూ పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన రానా.. ఇప్పుడు నిర్మాతగా దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే 35 చిన్న కథ కాదు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
Anchoring ante ila chusi chaduvutara.1st time telisindi pic.twitter.com/KLsxuzcAt5
— Agastya ♐ (@AgastyaMhr) September 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.