AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14ఏళ్లకే ఎంట్రీ.. హీరోయిన్‌గా స్టార్ డమ్..! ఇద్దరు స్టార్ హీరోలను ప్రేమించింది.. చివరకు

సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ నటి ఆమె.. కానీ ఆ స్టార్ హీరోయిన్ జీవితం ఆసక్తికర మలుపులతో నిండి ఉంది. ఆరేళ్లకే బాలనటిగా అడుగుపెట్టింది ఆ అందాల తార. 14ఏళ్లకే హీరోయిన్ అయ్యింది. ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమకథ ఎనిమిదేళ్లపాటు సాగింది, కానీ వివాహంగా మారలేదు.

14ఏళ్లకే ఎంట్రీ.. హీరోయిన్‌గా స్టార్ డమ్..! ఇద్దరు స్టార్ హీరోలను ప్రేమించింది.. చివరకు
Nargis Dutt
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 1:40 PM

Share

బాలీవుడ్ సినీ చరిత్రలో నర్గీస్ దత్ ఒక ధ్రువతారగా నిలిచారు. తన సహజమైన నటనతో, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నర్గీస్ జీవితం ఆసక్తికర మలుపులు ఉన్నాయి. ఆమె అసలు పేరు ఫాతిమా రషీద్. ఒక హిందూ యువకుడు, మోహన్ చంద్ ఉత్తమ్ చంద్, ముస్లిం కళాకారిణి జడ్డాన్ బాయ్ దంపతులకు జన్మించిన నర్గీస్, రెండు విభిన్న సంస్కృతుల వారసత్వాన్ని తనలో నింపుకున్నారు. ఆరో ఏటనే మెహబూబ్ ఖాన్ సినిమాలో బాలనటిగా వెండితెరకు పరిచయమైన నర్గీస్, అప్పట్లో బేబీ నర్గీస్గా ప్రసిద్ధి చెందారు. 14వ ఏట నుంచే ఆమె హీరోయిన్ వేషాలు వేయడం మొదలుపెట్టారు. నర్గీస్‌కు డాక్టర్ కావాలనే కల ఉండేది, కానీ విధి ఆమెను సినిమా రంగంలోకి నడిపింది.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

నర్గీస్ కెరీర్‌కు మలుపు తిప్పిన చిత్రం రాజ్ కపూర్‌తో కలిసి నటించిన ఆగ్. ఈ చిత్రం తర్వాత రాజ్ కపూర్, నర్గీస్ కాంబినేషన్‌కు అద్భుతమైన ఆదరణ లభించింది. వారి కెమిస్ట్రీ, నటన ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బర్సాత్, ఆవారా, శ్రీ 420 వంటి దాదాపు 12 చిత్రాల్లో ఈ జంట కలిసి నటించి, బాలీవుడ్‌లో ఒక ఐకానిక్ కాంబినేషన్‌గా నిలిచారు. తెరపై వారి ప్రేమాయణం నిజ జీవితంలోకి కూడా ప్రవేశించింది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు రాజ్ కపూర్‌తో నర్గీస్ ప్రేమ కొనసాగింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

అయితే, రాజ్ కపూర్ అప్పటికే కృష్ణా కపూర్‌ను వివాహం చేసుకుని, పిల్లలు (రణధీర్ కపూర్, రిషి కపూర్ ) ఉన్నారు. భార్యకు విడాకులు ఇవ్వమని నర్గీస్ అడిగినప్పటికీ, కుటుంబ బాధ్యతల వల్ల ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితి నర్గీస్‌ను తీవ్రంగా బాధించింది. ఈ సంఘటనల మధ్య, నర్గీస్ మదర్ ఇండియా చిత్రంలో నటించడం ప్రారంభించారు. ఈ సినిమాలో సునీల్ దత్, రాజేంద్ర కుమార్ ఆమె కొడుకులుగా నటించారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నర్గీస్ మంటల్లో చిక్కుకుపోగా.. సునీల్ దత్ ధైర్యంగా మంటల్లోకి దూకి, ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు. ఈ సంఘటన వారిద్దరి జీవితంలో ఒక కీలక మలుపు. సునీల్ దత్ త్యాగం, ప్రేమ నర్గీస్ మనసును గెలుచుకున్నాయి. ఈ ప్రమాదం తర్వాత వారిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె పేరు నిర్మలా దత్‌గా మారింది. అయినప్పటికీ, తన తల్లి పట్ల ఉన్న ప్రేమ, తన మూలాలను మర్చిపోకుండా, తాను ముస్లింగానే మరణించాలని, తన అంత్యక్రియలు ముస్లిం సంప్రదాయం ప్రకారం జరగాలని నర్గీస్ కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us