Nagarjuna: నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇప్పుడు ‘4కే’లో రానుందా..?

హీరోల బర్త్ డేలకు సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.

Nagarjuna: నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇప్పుడు '4కే'లో రానుందా..?
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 06, 2022 | 7:08 PM

టాలీవుడ్ లో నయా ట్రెండ్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరోల పాత సూపర్ హిట్ మూవీస్ ను తిరిగి 4కే వర్షన్ తో రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. హీరోల బర్త్ డేలకు సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలు రీరిలీజ్ చేశారు. ఈ సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ సినిమాకూడా భారీ వసూళ్లు రాబట్టాయి. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చెన్నకేశవ రెడ్డి సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున నటించిన సినిమా కూడా ఇప్పుడు 4కే రాబోతోందని తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో శివ ఒకటి. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాస్ సినిమాలకు మంచి మైలేజ్ ఇచ్చింది ఈ మూవీ.

ఈ సినిమాలో నాగ్ నటన.. ఆయన ప్రెజన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాగార్జునను రామ్ గోపాల్ వర్మ చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమను 4కే తో రిలీజ్ చేయాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు శివ సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.