Ahimsa: చాలా కాలం తర్వత తన మార్క్ మూవీతో రానున్న తేజ.. ఆకట్టుకుంటోన్న ‘అహింస’ టీజర్
ఇటీవల కాలంలో తేజ స్పీడ్ తగ్గించారనే చెప్పాలి. చాలా కాలం తర్వాత రానా హీరో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ తో సినిమా చేస్తున్నాడు.
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ. అందమైన ప్రేమ కథలను తనదైన మార్క్ తో తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు తేజ. ఇటీవల కాలంలో తేజ స్పీడ్ తగ్గించారనే చెప్పాలి. చాలా కాలం తర్వాత రానా హీరో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ తో సినిమా చేస్తున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్ గా విడుదల చేశారు నిర్మాతలు.
జీవితంలో పెద్ద కలలు లేని కుర్రాడు అభిరామ్. వ్యవసాయం చేసుకుంటూ తనకున్న దానితో సంతోషంగా ఉంటాడు. హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని అనుసరించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెబుతుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అహింసని పాటించే అభిరాయ్ కి హింసాత్మక పరిస్థితులు ఎదురైతే ఏం జరిగిందనేది కథా నేపథ్యం అని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. తేజ ఒక అందమైన ప్రేమకథను అద్భుతంగా చెప్పారు. టీజర్‌ను చూస్తుంటే కథలో బలమైన సంఘర్షణ వుందని అర్ధమౌతుంది. అభిరామ్ పాత్రకు పూర్తి న్యాయం చేయగా, గీతికకు బలమైనపాత్ర లభించింది. టీజర్‌లో సదా, మరికొన్ని పాత్రలు కూడా ఉన్నాయి.
ఆర్‌పి పట్నాయక్ తన ప్లజంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథకు మరింత అందాన్ని జోడిస్తో, యాక్షన్ పార్ట్‌కి కూడా సరైన మూడ్‌ని సెట్ చేశారు. తేజ, ఆర్పీ పట్నాయక్ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయగా, సమీర్ రెడ్డి కెమెరా పనితనం అత్యున్నతంగా ఉంది. మొత్తంమీద, టీజర్ భారీ అంచనాలను పెంచింది. ఇది తేజ మార్క్ సినిమా అని భరోసా ఇస్తోంది. టీజర్ ద్వారా ప్రకటించినట్లుగా, అహింస త్వరలో థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.