AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vallabhaneni Janardhan: ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ కన్నుమూత..

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యతో అపోలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు ఆయన కన్నుమూశారు.

Vallabhaneni Janardhan: ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ కన్నుమూత..
Vallabhaneni Janardhan
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2022 | 11:22 AM

Share

తెలుగు చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత నాలుగు నెలల్లోనే నలుగురు లెజండరీ నటులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్ నటుడు చలపతి రావు మరణించారు. బుధవారం ఉదయం మహాప్రస్థానంలో చలపతి రావు అంత్యక్రియలను పూర్తిచేశారు ఆయన తనయుడు రవిబాబు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యతో అపోలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శన నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ పెళ్లిచేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత. చిన్నతనంలోనే మరణించగా.. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్.. ఇక అబ్బాయి అవినాశ్ అమెరిగాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జనార్ధన్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.

నిర్మాత వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో జన్మించారు. ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఎక్కువగా. విజయవాడలోని లయోలా కాలేజీలో చదువుపూర్తిచేసిన ఆయన.. సినిమాపై ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మామ్మగారి మనవలు అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడలో హిట్ అయిన మానససరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా తోడు నీడ చిత్రాన్ని నిర్మించారు.

తన కూతురు శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషన్ సంస్థను స్థాపించి శ్రీమితి కావాలి, పారిపోయిన ఖైదీలు చిత్రాలను రూపొందించారు. తన మామ విజయబాపినీడుతో కలిసి మహాజనానికి మరదలు పిల్ల చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ మూవీలో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్ధన్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ రాణించారు. సినిమా అంటే ఉన్న ఇష్టంతో చిన్న చిన్న పాత్రలు సైతం పోషించేవారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు జనార్ధన్. అలాగే బుల్లితెరపై అన్వేషిత సీరియల్ లోనూ అలరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.