F3 Movie: దూసుకుపోతున్న ఎఫ్ 3.. మొదటి వారం ఎంత వసూల్ చేసిందంటే..

సమ్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు వెంకీ, వరుణ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3 సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఈ మూవీ

F3 Movie: దూసుకుపోతున్న ఎఫ్ 3.. మొదటి వారం ఎంత వసూల్ చేసిందంటే..
F3
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2022 | 5:32 PM

సమ్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు వెంకీ, వరుణ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3(F3 Movie) సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఈ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఎఫ్ 3లో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలలో అలరించారు. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఎఫ్ 2 కు మించి ఈ సినిమాలో కామెడీ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్లు తమన్నా భాటియా – మెహ్రీన్ పాత్రలు కూడా వినోదభరితంగా ఉన్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు.ఇక ఈ సినిమాలో సీన్ సీన్‌కి.. స్క్రీన్ మీద పేలుతున్న పంచులకీ.. ఫన్ ఫుల్గా ఫీలవుతున్నారు ఇదే ఆడియన్స్. ఎఫ్ 2′ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే నే మంచి వసూళ్లతో సత్తా చాటింది. ఎఫ్ 3′ సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. 100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.06 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా 52.1 కోట్లు షేర్ చేసింది ఎఫ్ 3. నైజాం – 17 కోట్లు, UA – 5.42 కోట్లు, తూర్పు – 3.2 కోట్లు, వెస్ట్ – 2.44 కోట్లు, సీడెడ్ – 6.7 కోట్లు, గుంటూరు – 3.20 కోట్లు, కృష్ణ – 3.1 కోట్లు, మొత్తం AP/TS షేర్ – 41.06 కోట్లు, కర్ణాటక – 2.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియా – 1.5 కోట్లు, ఓవర్సీస్ – 7.2 కోట్లు, వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ – 52.1 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ – 94 కోట్లు   ఎఫ్ 3 మూవీ  రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే