Shah Rukh Khan: షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ వచ్చేసింది.. అంచనాలు అమాంతం పెంచేసిన బాద్షాషా ఫస్ట్ లుక్..
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షాషా, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇలా వచ్చిందో లేదో అలా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న...
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షాషా, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇలా వచ్చిందో లేదో అలా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌కు జోడిగా తొలిసారి నయనతార నటిస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడమే ఈ జాప్యానికి కారణంగా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా సినిమా చిత్రీకరణలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్ ఇచ్చేసింది. సినిమా టైటిల్, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సినిమాలో షారుఖ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాను ‘జవాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక షారుఖ్ ఇందులో డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. షారుఖ్ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేస్తున్న వీడియో సినిమా ఆసక్తిని పెంచేసింది.
జూన్2 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు షారుఖ్ భార్య గౌరీఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..