Bigg Boss Telugu: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ.! బిగ్ బాస్ 8 హోస్ట్‌గా శివాజీ.. కంటెస్టెంట్స్‌కు చుక్కలే..

తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ఈ గేమ్ షో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 8 కు సిద్ధం అవుతుంది.

Bigg Boss Telugu: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ.! బిగ్ బాస్ 8 హోస్ట్‌గా శివాజీ.. కంటెస్టెంట్స్‌కు చుక్కలే..
Shivaji
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jun 18, 2024 | 5:19 PM

బిగ్ బాస్ గేమ్ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పటికే ఇండియాలో వివిధ బాషలలో టెలికాస్ట్ అవుతుంది. తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ఈ గేమ్ షో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 8 కు సిద్ధం అవుతుంది. గత 5 సీజన్స్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే చివరి సీజన్ అంటే సీజన్ 7 కు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని సీజన్స్ కంటే దీనికే ఎక్కువ టీఆర్ఫీ వచ్చింది.

రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్ వరకు నిలబడి సీజన్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 7 హౌస్ లో మాములు రచ్చ జరగలేదు. అబ్బో సీరియల్ బ్యాచ్ గా కొంతమంది.. మరో బ్యాచ్ గా కొంతమంది.. మధ్యలో పెద్దమనిషిగా శివాజీ ఇలా చాలా ఆట జరిగింది. అయితే ఈ సీజన్ లో ప్రేక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం శివాజి, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. శివాజీ హౌస్ లో ఉన్నవారిని కంట్రోల్ చేయడం, అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా ఉండేవి.

సీరియల్ బ్యాచ్ నుంచి పల్లవి ప్రశాంత్ ను ప్రొటెక్ట్ చేస్తూ , అతనికి మద్దతిస్తూ చివరకు విన్నర్ అయ్యే వరకు అతనికి తోడుగా ఉన్నాడు శివాజీ. ఈ క్రమంలో హౌస్ లో ఉన్నవారందరితో గొడవలు కూడా పెట్టుకున్నాడు. స్ట్రయిట్ ఫార్వార్డ్ మాట్లాడుతూ ఒకొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 లో కూడా శివాజీ కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక జరిగుతోంది. కాగా ఈ సారి బిగ్ బాస్ బజ్ కు శివాజీ హోస్ట్ గా ఉంటాడని తెలుస్తోంది. బిగ్ బాస్ బజ్ కు మాజీ కంటెస్టెంట్స్ హోస్ట్ గా ఉంటారు. లాస్ట్ సీజన్ కు గీతూ రాయల్ హోస్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ బజ్ కు శివాజీ హోస్ట్ గా ఉండనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..