Thank You: అక్కినేని యంగ్ హీరో సినిమా నుంచి మరో అందమైన మెలోడీ..

అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య స్పీడ్ పెంచాడు. ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న చైతూ.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Thank You: అక్కినేని యంగ్ హీరో సినిమా నుంచి మరో అందమైన మెలోడీ..
Thank You
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2022 | 6:58 PM

అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య(Naga Chaitanya Akkineni) స్పీడ్ పెంచాడు. ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న చైతూ.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ(Thank You) అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా లో చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా కనిపించనున్నాడట చైతూ.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చైతన్య ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.

తాజాగా ఈ సినిమానుంచి అందమైన మెలోడీ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. `ఏంటో ఏంటేంటో..` అంటూ సాగే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని గురువారం విడుదల చేశారు.   తమన్ సంగీతంలో అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా జోనితా గాంధీ ఆలపించారు. ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో నాగచైతన్య యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా అతనికి జోడీగా మాళవిక నాయర్ కనిపించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ జూలై 7న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.