Agent: రిలీజ్ డేట్ మార్చుకున్న ఏజెంట్ టీమ్.. అఖిల్ సినిమా వచ్చేది అప్పుడేనా..?

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jun 16, 2022 | 7:40 PM

అక్కినేని యువ సామ్రాట్ అఖిల్ వరుస సినిమాలతో జోరు పెంచాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Agent: రిలీజ్ డేట్ మార్చుకున్న ఏజెంట్ టీమ్.. అఖిల్ సినిమా వచ్చేది అప్పుడేనా..?
Agent

అక్కినేని యువ సామ్రాట్ అఖిల్( Akhil Akkineni) వరుస సినిమాలతో జోరు పెంచాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు అఖిల్. ఇక ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఏజెంట్(Agent) అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో డిసెంట్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏజెంట్ చిత్రం కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో హాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా మారిపోయాడు. అఖిల్‌ ఏజెంట్‌ లుక్‌ చూస్తే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోంది.

ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చనున్నారట మేకర్. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు టాక్ వినిపిస్తోంది.  . ముందుగా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి కుదరకపోవడంతో గట్టిపోటీ ఉన్నప్పటికీ దసరాను ఎంచుకున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu