Venu Udugula: ‘రాసుకోనంత వరకూ వేటగాడు చెప్పేదే చరిత్ర’.. వేణు ఊడుగుల ఆసక్తికర వ్యాఖ్యలు

అడవి కాచిన వెన్నెల కాదు.. అడవి మింగిన వెన్నెల కథే..! మా ఈ వెన్నెల కథ.. విరాట పర్వమే ఆమె వ్యథ అని అంటున్నారు విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల(Venu Udugula).

Venu Udugula: 'రాసుకోనంత వరకూ వేటగాడు చెప్పేదే చరిత్ర'.. వేణు ఊడుగుల ఆసక్తికర వ్యాఖ్యలు
Venu Udugula
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2022 | 7:57 PM

అడవి కాచిన వెన్నెల కాదు.. అడవి మింగిన వెన్నెల కథే..! మా ఈ వెన్నెల కథ.. విరాట పర్వమే ఆమె వ్యథ అని అంటున్నారు విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల(Venu Udugula). అనడమే కాదు.. నట్టనడి రాతిరిలో.. చిట్టడవి దారిలో.. నక్సలైట్లకు.. పోలీసులకు జరుగుతున్న భీకర్ పోరులో.. పురుడు పోసుకున్న పాపే మా వెన్నెల అంటూ.. సినిమాకు ముందే ఓ వీడియోను రిలీజ్ చేశారు. బర్త్‌ ఆఫ్ వెన్నెల పేరుతో రిలీజైన ఆ గ్లింప్స్ ఇప్పుడు నెట్టంట అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వేణు మాట్లాడుతూ..

నా రైటింగ్ , డైరెక్షన్ టీం కి కృతజ్ఞతలు. సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోనంత వరకూ వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది. మన జీవితాన్ని మనం ఆవిష్కారించనంత వరకూ పక్కవాడు చెప్పేదే మన జీవితం అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,ప్రకాష్ కోవెలమూడి,టీ కృష్ణ, నేడు సుకుమార్.. వీరందరి స్ఫూర్తితోనే నా మూలాల్లోకి వెళ్లి తీసిన సినిమా విరాట పర్వం. ఇందులో హింసని గ్లామర్ గా చూపించలేదు. మావో సిద్దాంతాన్ని ప్రోపగాండ గా చెప్పలేదు. ప్రేమ దైవమని చెప్పాం. మానవ స్వేఛ్చలో ప్రేమ ఒక భాగమని చెప్పాం. ప్రేమకి మించిన ప్రజాస్వామిక విలువ ఈ భూమ్మిద ఏదీ లేదని చెప్పాం. 1990లో ఒక రాజకీయ సంక్షోభాన్ని కాన్వాస్ గా చేసుకొని నాటి మానవీయ పరిస్థితి చర్చించే ప్రేమకథ విరాట పర్వం. పాటకి పల్లవి ఎంత ముఖ్యమో విరాట పర్వానికి సాయి పల్లవి గారు అంత ముఖ్యం. సాహిత్యం లేకుండా పాట ఉటుందా ? పాటకి సాహిత్యం ఎంత ముఖ్యమో ఈ చిత్రానికి రానా గారు అంత ముఖ్యం. రానా గారు చంద్రుడైతే సాయి పల్లవి వెన్నెల. ఈ చిత్రంలో ఎనిమిది కీలక పాత్రల్లో ఐదు పాత్రలు స్త్రీలు పోషించారు. ఒక్కొక్క పాత్ర ఒక్కో దశలో కథని మలుపు తిప్పుకుంటూ వెళుతుంది. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి ఇలా సాంకేతిక నిపుణులు ఎంతో గొప్ప స్పిరిట్ తో పని చేశారు. ఇంత గొప్ప నటీనటులు, టెక్నికల్ టీం ఇచ్చిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు. వారు ఈ అవకాశం ఇవ్వడం వలనే ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తీయగలిగాను. జూన్ 17న విరాట పర్వం మీ ముందుకు వస్తుంది. మీకు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను” అన్నారు