Sammathame: ‘నా లైఫ్ లో గోలే లైఫ్ లోకి గర్ల్ రావడం’.. ఆకట్టుకుంటోన్న సమ్మతమే ట్రైలర్
టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు. రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే(Sammathame) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఈ సినిమాను జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా గురువారం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ని సొంతం చేసుకోవడంతో ‘సమ్మతమే’ సేఫ్ హాండ్స్ లోకి వెళ్ళింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మి.. వాళ్ళు లేని ఇల్లు ఇలానే ఉంటుంది’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ ట్రైలర్ లో పెళ్లికోసం తాపత్రపడే కుర్రాడిగా కిరణ్ అబ్బవరం కనిపించనున్నాడు. ‘నీకు లైఫ్ లో గోల్ ఇంపార్టెంటా? లైఫ్ లోకి వచ్చే గర్ల్ ఇంపార్టెంటా?’ అని హీరోయిన్ అడగ్గా.. ‘నా లైఫ్ లో గోలే లైఫ్ లోకి గర్ల్ రావడం’ అని హీరో చెప్పడం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.