Breaking : రియా చక్రవర్తికి ఈడీ సమన్లు

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసులో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది.

Breaking : రియా చక్రవర్తికి ఈడీ సమన్లు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2020 | 11:18 PM

Sushant death case: బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసులో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 7న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని రియాను ఈడీ ఆదేశించింది. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు లావాదేవీలు జరగడంపై.. సందేహాలు రావ‌డంతో ఈడీ గత వారం మనీలాండరింగ్‌ కేసు ఫైల్ చేసింది. ఆర్థిక లావాదేవీల అంశంపై ప్రధానంగా సుశాంత్‌కు ద‌గ్గ‌రగా మెలిగిన‌ రియాను విచారించనున్నారు. అలాగే, ఈ వ్యవహారంలో కాస్త అనుమానం ఉన్న వ్య‌క్తులంద‌రికీ సమన్లు జారీచేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సుశాంత్ అనుమానాస్ప‌ద డెత్ కేసును సీబీఐకు అప్ప‌గించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు సుప్రీం కోర్టుకు తెలిపారు.

మరోవైపు, బిహార్ రాజ‌ధాని పాట్నాలో తనపై దాఖలైన కేసు విచారణను ముంబైకి మార్చాలని కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధ‌వారం విచార‌ణ జ‌రిపింది. ఇరు వర్గాలు మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ.. కేసు విచార‌ణ‌ను మ‌రో వారం పాటు వాయిదా వేసింది.

Read More : చైనాలో మ‌రో కొత్త‌ అంటువ్యాధి​.. ఏడుగురు మృతి !