మరో నటుడు ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం
బాలీవుడ్‌ను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యం బాగోలేకనో, ఆత్మహత్య చేసుకునో ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది కన్నుమూశారు.
Actor Sameer Sharma commits suicide: బాలీవుడ్‌ను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఆరోగ్యం బాగోలేకనో, ఆత్మహత్య చేసుకునో ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది కన్నుమూశారు. తాజాగా పలు సీరియళ్లలో నటించిన టీవీ నటుడు సమీర్ శర్మ(44) ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ మలాద్‌లోని అహింసా మార్గ్‌లో తన నివాసంలో సీలింగ్‌కి ఉరేసుకొని ఆయన తనువు చాలించారు. మలాద్ పోలీసుల ప్రకారం.. సమీర్ నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, బుధవారం రాత్రి సీలింగ్‌కి వేలాడుతున్న అతడి శరీరాన్ని గమనించారు. వెంటనే సొసైటీ మెంబర్‌లకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సమీర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితమే సమీర్ సూసైడ్ చేసుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు. కాగా ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘క్యోంకి సాస్ బీ కబీ బాహు తి’, ‘హే రిష్తీ హై ప్యార్ కే’ సీరియళ్లలో సమీర్ నటించారు.
Read This Story Also: నయన్ సంచలన నిర్ణయం.. కీర్తి తల్లి పాత్రకు ఓకే!