నయన్ సంచలన నిర్ణయం.. కీర్తి తల్లి పాత్రకు ఓకే!
: వరుస విజయాలతో దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. ఈ హీరోయిన్ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయారు.
Nayanthara as Keerthy Suresh mother: వరుస విజయాలతో దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. ఈ హీరోయిన్ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటు సీనియర్, ఇటు జూనియర్ హీరోల సరసన జత కడుతూ కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్లకు కూడా గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఈ భామ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న పిల్లల తల్లి పాత్రలో నటించిన నయన్., ఈ సారి స్టార్ హీరోయిన్ తల్లిగా నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ హీరోగా సిరుతై శివ తెరకెక్కిస్తోన్న ‘అన్నాత్తే’లో నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తి, రజనీ కుమార్తెగా కనిపించనుందట. ఇక ఆమె తల్లి పాత్రలో నయన్ కనిపించనున్నట్లు సమాచారం. తన పాత్ర బలంగా ఉండటంతో ఇందులో నటించేందుకు నయన్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ మార్చి నెలలో ఆగిపోగా.. త్వరలోనే మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: మరోసారి పేలిన బాయిలర్.. ఒకరి మృతి