ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ దూకుడు : క్రేజీ ఫీట్
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్...తమిళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పించింది. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో రకాల వీడియోలను అప్‌లోడ్ చేసి నెటిజన్ల అభిమానాన్ని చూరగొంది.
Rakul Preet Singh hits 15 million followers on Instagram :ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్…తమిళ, హిందీ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో రకాల వీడియోలను అప్‌లోడ్ చేసి నెటిజన్ల అభిమానాన్ని చూరగొంది. నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే ఈ సుందరాంగి..తాజాగా మరో ఫీట్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది.
“చిన్నతనంలోనే యాక్టింగ్ స్టార్ట్ చేశా. అసలు అప్పుడు నేను చేస్తున్న వర్క్ ఏంటో, నా స్కిల్స్ ఏంటో, ఈ సామాజిక మాధ్యమాల ఏంటో తెలీదు. కానీ మీరందరూ నేను ఈ స్థాయికి చేరుకోడానికి సహాయసహకారాలు అందించారు. ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. ఈ ప్రేమను నేను ఎప్పటికి మర్చిపోను. మీకు రుణపడి ఉంటా. మీ అందరిని అలరించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానని మాట ఇస్తున్నా. మీరు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఇక్కడ ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఏ సంతోషమైనా మీతోనే పంచేకుంటున్నా” అని రకుల్ ప్రీత్ పేర్కొంది.
రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవ్‌గన్, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి ‘థాంక్స్ గాడ్’ అనే కామెడీ మూవీ చేస్తోంది.
Also Read : రియా చక్రవర్తికి ఈడీ సమన్లు